AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘నాతో పోటీపడే సత్తా మీలో ఉందా’.. కొత్త మురిపెంతో రచ్చ చేస్తోన్న ‘తాబేలు’..

Viral Video: కుందేలు, తాబేలు స్టోరీ వినే ఉంటారు. క్షణకాలంలో చాలా దూరం పరుగెత్తగల సత్తా కుందేలు సొంతం.. గంట సమయం గడిచినా కొంత దూరం కూడా వెళ్లలేని దైన్యం తాబేలు సొంతం.

Viral Video: ‘నాతో పోటీపడే సత్తా మీలో ఉందా’.. కొత్త మురిపెంతో రచ్చ చేస్తోన్న ‘తాబేలు’..
Turtles
Shiva Prajapati
|

Updated on: Sep 21, 2022 | 1:22 PM

Share

Viral Video: కుందేలు, తాబేలు స్టోరీ వినే ఉంటారు. క్షణకాలంలో చాలా దూరం పరుగెత్తగల సత్తా కుందేలు సొంతం.. గంట సమయం గడిచినా కొంత దూరం కూడా వెళ్లలేని దైన్యం తాబేలు సొంతం. కానీ, నిదానంతోనే పోటీలో గెలుపొందడం దాని స్పెషాలిటీ. అవును, కుందేలు, తాబేలు పరుగుల పోటీలో చివరకు తాబేలే గెలుస్తుంది. ఎందుకంటే.. స్పీడ్‌గా వెళ్లి అలసిపోయిన కుందేళలు హాయిగా నిద్రపోతుంది. నెమ్మదిగా వెళ్లిన కుందేలు తన గమ్యాన్ని చేరి విజయాన్ని సాధిస్తుంది. అయితే, ఇదంతా కథ వరకే పరిమితం.. వాస్తవ జీవితంలో చల్ హట్ అంటోంది తాబేలు. అవును.. నేనేంటి నెమ్మదిగా పరుగెత్తడం ఏంటి? పోటీ పెట్టండి పరుగుల రారాజు హుస్సేన్ బోల్ట్‌లోనే పోటీపడతానంటోంది ఈ తాబేలు. అవును మరి, టెక్నాలజీని అందిపుచ్చుకున్నాననే ధైర్యం కాబోలు.. తన కాళ్లకు చక్రాలను జోడించుకుని తెగ పరుగులు తీస్తోంది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది.

ఇంతకీ విషయం ఏంటంటే.. @Laughs_4_All పేరుతో ట్విట్టర్ అకౌంట్‌లో ఓ తాబేలుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియాలో తాబేలు.. రిమోట్ కారుపై తేరగా కూర్చుకుంది. కారు చక్రాలకు, తన కాళ్లను జత చేసింది రయ్ రయ్ మంటూ పరుగులు తీసింది. తెడ్డుతో నెడితే పడవ ముందుకు కదిలినట్లుగా, తాబేలు తన కాళ్లు, చేతులతో ముందుకు నెడుతూ దూసుకెళ్తోంది. స్పీడ్‌గా ముందుకు కదులుతుంటే.. దానికి సంతోషంగా ఉన్నట్లుంది. అందుకే మళ్లీ మళ్లీ స్పీడ్‌గా ముందుకు పరుగులు తీస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 9 సెకన్లపాటు ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. చరిత్రను తిరగరాస్తున్న తాబేలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలి ఆరుగురు మృతి
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలి ఆరుగురు మృతి
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!