AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో! నువ్వు దేవుడివి సామీ.. బుసులు కొడుతున్న కింగ్ కోబ్రాను కూల్‌గా బుజ్జగించేశావ్..

సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు రకరకాలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యపరిస్తే..

Viral Video: వామ్మో! నువ్వు దేవుడివి సామీ.. బుసులు కొడుతున్న కింగ్ కోబ్రాను కూల్‌గా బుజ్జగించేశావ్..
Snake Viral Video
Ravi Kiran
|

Updated on: Sep 21, 2022 | 1:15 PM

Share

సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు రకరకాలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటో చూసేద్దాం..

వైరల్ వీడియో ప్రకారం.. ఓ పాడుబడిన ఇంట్లోకి భారీ సైజ్ కింగ్ కోబ్రా ఒకటి దూరుతుంది. ఆ పామును చూసిన వెంటనే స్థానికులు ఒక్కసారిగా హడలిపోతారు. వెంటనే సమాచారాన్ని స్నేక్ క్యాచర్‌ కిరణ్‌కు అందిస్తారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పాట్‌కు చేరుకున్న స్నేక్ క్యాచర్.. ఆ పామును చాకచక్యంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అది కాస్తా అక్కడుంచి పారిపోతుంది. పాము తోకను పట్టుకుని ఎలాగైనా కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తాడు స్నేక్ క్యాచర్. అయినా అది ఎక్కడా కూడా అతడికి చిక్కలేదు. ముప్పుతిప్పలు పెట్టింది.

అనంతరం స్టిక్‌తో పామును కదిలిస్తాడు. అంతే! ఒక్కసారిగా అది స్నేక్ క్యాచర్ కిరణ్ మీదకు బుసులు కొడుతూ కాటు వేసేందుకు వస్తుంది. అయినా కూడా వెనక్కి తగ్గని స్నేక్ క్యాచర్.. ఆ పామును బుజ్జగిస్తూ.. చివరికి తెలివిగా సంచిలో బంధిస్తాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో కొంచెం పాతదే అయినప్పటికీ.. మరోసారి మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Follow Us
ఎలక్ట్రికల్ ఫ్యూజ్‌లో ఎక్కువ వైర్లు వేస్తే ఏమవుతుంది?
ఎలక్ట్రికల్ ఫ్యూజ్‌లో ఎక్కువ వైర్లు వేస్తే ఏమవుతుంది?
రోజుకో అరటిపండు.. మామూలు విషయం.. మీ ఆరోగ్యానికి తిరుగులేని ఔషధం!
రోజుకో అరటిపండు.. మామూలు విషయం.. మీ ఆరోగ్యానికి తిరుగులేని ఔషధం!
డబ్ల్యూఏపీఎల్‌ తొలి ఛాంపియన్‌గా రాయలసీమ.. ఫైనల్లో గోదావరికి షాక్‌
డబ్ల్యూఏపీఎల్‌ తొలి ఛాంపియన్‌గా రాయలసీమ.. ఫైనల్లో గోదావరికి షాక్‌
గుడికి వెళ్లి వస్తున్న భార్యను కత్తితో పొడిచిన భర్త!
గుడికి వెళ్లి వస్తున్న భార్యను కత్తితో పొడిచిన భర్త!
బాడీని డీటాక్స్ చేసే అద్భుతమైన పండు.. ఉదయాన్నే ఓ కప్పు తింటే..
బాడీని డీటాక్స్ చేసే అద్భుతమైన పండు.. ఉదయాన్నే ఓ కప్పు తింటే..
తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారా? తక్షణ ఉపశమనం కోసం ఇలా చేస్తే
తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారా? తక్షణ ఉపశమనం కోసం ఇలా చేస్తే
వాళ్ళకోసం నేను పెళ్లి చేసుకోవాలా.?
వాళ్ళకోసం నేను పెళ్లి చేసుకోవాలా.?
యుద్ధం ముగియకముందే ట్రంప్ కీలక ప్రకటన..!
యుద్ధం ముగియకముందే ట్రంప్ కీలక ప్రకటన..!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాలకుల నీరు తాగుతున్నారా?ఈ విషయాలు తెలిస్తే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాలకుల నీరు తాగుతున్నారా?ఈ విషయాలు తెలిస్తే
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ