AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Science Facts: చలికాలంలో ఇంట్లో వస్తువులను తాకితే మీకు ఎప్పుడైనా షాక్‌ కొట్టినట్లు అనిపించిందా? దీని వెనుక సైన్స్‌ ఇదే..

ఇంట్లో కుర్చీలు, ఆఫీస్‌ డోర్లు పట్టుకున్నప్పుడు కొన్ని సార్లు కరెంటు షాక్ తగిలినట్లు అనిపిస్తుంది. అలాగే ఫ్రెండ్స్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినప్పుడు కూడా ఒక్కోసారి షాక్‌ తగిలిన అనుభూతి కలుగుతుంది. నిజంగా కరెంటు కొట్టకపోయినా.. వాటిని తాకగానే కరెంట్ షాక్ కొట్టినట్లు..

Science Facts: చలికాలంలో ఇంట్లో వస్తువులను తాకితే మీకు ఎప్పుడైనా షాక్‌ కొట్టినట్లు అనిపించిందా? దీని వెనుక సైన్స్‌ ఇదే..
Static Electricity
Srilakshmi C
|

Updated on: Sep 23, 2022 | 7:22 PM

Share

How is static electricity produced in materials: ఇంట్లో కుర్చీలు, ఆఫీస్‌ డోర్లు పట్టుకున్నప్పుడు కొన్ని సార్లు కరెంటు షాక్ తగిలినట్లు అనిపిస్తుంది. అలాగే ఫ్రెండ్స్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినప్పుడు కూడా ఒక్కోసారి షాక్‌ తగిలిన అనుభూతి కలుగుతుంది. నిజంగా కరెంటు కొట్టకపోయినా.. వాటిని తాకగానే కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది. ఐతే ఇది ఎందుకు జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి చలికాలంలో ఈ తరహా సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఎందుకంటే శీతాకాలంలో గాలిలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. ఇది కొంచెం సూది గుచ్చుకున్నట్లుగా అనుభూతిని కలిగిస్తుంది. అలాంటి భావనే షాక్‌కు కారణమవుతుంది. రోజు వారీ వస్తువుల్లో కరెంట్‌ షాక్‌ ఎలా, ఎందుకు ఉత్పత్తి అవుతుందంటే..

భౌతిక శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే.. ఈ ప్రపంచంలోని పదార్ధాలన్నీ పరమాణువులతో తయారయ్యి ఉంటాయి. ఈ పరమాణువు ప్రతికూలంగా చార్జ్ చేయబడిన ఎలక్ట్రాన్లు, ధనాత్మకంగా చార్జ్ చేయబడిన ప్రోటాన్లు, తటస్థ న్యూట్రాన్లను కూడా కలిగి ఉంటాయి. మన శరీరంలో ఎప్పుడూ ఒకే సంఖ్యలో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఉంటాయి. శరీరం అణువులను స్థిరంగా ఉంచుతుంది. ఐతే అవి ఎప్పుడైతే అసమతుల్యమౌతాయో అంటే వాటి సంఖ్యలో సమానత కొరవడినప్పుడు ఎలక్ట్రాన్లలో చలనం సంభవిస్తుంది. సైన్స్ ప్రకారం.. ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగేకొద్దీ, నెగెటివ్‌ చార్జ్‌ను సృష్టించి, పాజిటివ్‌ ఎలక్ట్రాన్ల మాదిరి కదులుతాయి. మనం ఏదైనా వస్తువు లేదా మనిషిని తాకినప్పుడు దానిలోని పాజిటివ్‌ ఎలక్ట్రాన్లు, మనలో నెగెటివ్‌ ఎలక్ట్రాన్లను సృష్టిస్తుంది. దీని వల్ల మనకు షాక్‌ తగిలినట్లు అనిపిస్తుంది. ఈ విధమైన వైబ్రేషన్‌ కొన్ని సందర్భాల్లో కొన్ని అంగుళాల దూరం వరకు సంభవిస్తుంది.కొన్నిసార్లు స్వెటర్ల వంటి ఉన్ని వస్తువులను తాకినప్పుడు కూడా ఇలా జరుగుతుంది. స్వెటర్లు తీయగానే విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఈ విధమైన కరెంట్‌ మన వెంట్రుకల్లో కూడా ఉత్పత్తి అవుతుంది.

తాకినప్పుడు కరెంట్ ఎలా పుడుతుంది?

ఇవి కూడా చదవండి

ముందుగా చెప్పుకున్నట్లు ఈ సృష్టిలోని పదార్ధాలన్ని పరమాణువులు, అణువులు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లతో నిర్మితమై ఉంటుంది. ఎలక్ట్రాన్లు నెటెటివ్‌ చార్జ్ కలిగి ఉంటాయి. ప్రోటాన్లు పాజిటివ్‌ చార్జ్ కలిగి ఉంటాయి. న్యూట్రాన్ తటస్థంగా ఉంటుంది. అణువు కేంద్రకంలో ప్రోటాన్లు ఉంటే, ఎలక్ట్రాన్లు మాత్రం న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు సమాన సంఖ్యలో ఉన్నప్పుడు అణువు స్థిరంగా ఉంటుంది. ఈ రెండింటి సంఖ్యలో తేడా ఏర్పడితే, ఎలక్ట్రాన్లు బౌన్స్ అవ్వడం ప్రారంభిస్తాయి. దీంతో అణువులో కదలిక ఏర్పడి.. కరెంట్‌ ఉత్పత్తి అవుతుంది.

ఇలా షాక్‌ కొట్టడం వెనుక సైన్స్‌ రహస్యం ఇదే..

కుర్చీలు, తలుపుల వంటి వస్తువులు కండక్టర్లుగా వ్యవహరించి ఎలక్ట్రాన్లు ప్రవహించడానికి అంత సులభంగా అనుమతించవు. అందువల్లనే పరమాణువులో ఎలక్ట్రాన్లు ప్రవహిస్తూనే ఉంటాయి. అదేవిధంగా ఆ పదార్థంలో కరెంట్ కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. ఒక వస్తువులో ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగే కొద్దీ ఆ వస్తువు యొక్క నెగటివ్ చార్జ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి ప్రక్రియ జరితూ ఉండే వస్తువులను మనం తాకినప్పుడు.. మన శరీరంలోని పాజిటివ్‌ ఎలక్ట్రాన్లు, ఆ వస్తువులోని నెగెటివ్‌ ఎలక్ట్రాన్‌ తన వైపుకు లాగడం ప్రారంభిస్తాయి. ఈ ఎలక్ట్రాన్ల వేగవంతమైన కదలిక కారణంగా మనకు కరెంట్ షాక్‌ తగిలిన అనుభూతి కలుగుతుంది.