ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో సోంపు, బెల్లం కలిపి తిని చూడండి..!

18 March 2025

TV9 Telugu

TV9 Telugu

ఆరోగ్యకరమైన ఆహారం మన వంటింట్లోనే ఉంటుంది. కానీ, మనమే వాటిని అశ్రద్ధ చేస్తుంటాము. మనకు అందుబాటులోనే ఉండే సోంపు గింజలు ఎంతో మేలు చేస్తాయి

TV9 Telugu

వాటిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి బలేగా మేలు చేస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట నీటిలో నానబెట్టిన సోంపును ఉదయం బెల్లంతో కలిపి తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు

TV9 Telugu

సోంపులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో ఫైబర్, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి మంచి పోషకాలు అధికంగా ఉంటాయి

TV9 Telugu

ఇక బెల్లంలో కోలిన్, ఫాస్పరస్, మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్, బీటైన్, విటమిన్ బి12, బి6, ఫోలేట్, కాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి

TV9 Telugu

సోంపు, బెల్లం కలిపి తినడం వల్ల జీవక్రియను పెంచుతాయి. శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చడమే జీవక్రియ ముఖ్య పని. ఈ రెండింటిని తినడం ద్వారా ఈ ఫంక్షన్ మరింత మెరుగ్గా పనిచేస్తుంది

TV9 Telugu

సోంపు సహజ నోటి ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది. సోంపు, బెల్లం తినడం వల్ల నోటి దుర్వాసన చాలా కాలం పాటు దూరంగా ఉంటుంది

TV9 Telugu

బెల్లం శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడుతుంది. సోంపు, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల నీరసం తొలగిపోయి తక్షణ శక్తి అందుతుంది

TV9 Telugu

సోంపు, బెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్, ఆమ్లత్వం, ఉబ్బరం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి