ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..వీడియో
సుదూరా ప్రాంతాలకు ప్రయాణించాలంటే మొదటి ఆప్షన్ రైలు. రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండటంతో చాలామంది దీనినే ఎంచుకుంటారు. కొందరు స్లీపర్ క్లాస్‌లో ప్రయాణిస్తే ఇంకొందరు సౌకర్యవంతంగా ఉంటుందని ఏసీకోచ్‌లో ప్రయాణిస్తారు. అలా ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. దాంతో అతను ఇంత ఖర్చుపెట్టి ఏసీ టికెట్ కొనుక్కుంది ఇందుకేనా అంటూ తనకు రైల్లో ఎదురైన అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు.
ఓ వ్యక్తి రూ.2000 ఖర్చు చేసి రైల్లో ఏసీ టికెట్ కొన్నాడు. ఏసీకోచ్‌లో ప్రయాణించేవారికి రైల్వేనే దిండు, దుప్పటి, బెడ్ షీట్ అందిస్తుంది. అయితే ఈ వ్యక్తి పడుకుందామని బెడ్‌పై దిండు బెడ్‌షీట్ సరిచేస్తుండగా షాకింగ్ సీన్ కనిపించింది. దిండుకిందనుంచి ఓ ఎలుక చటుక్కున పైకి వచ్చి దుప్పటిలో దూరింది. ఊహించని ఈ పరిణామానికి అతను ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత అక్కడంతా పరిశీలించి చూశాడు. ఈ క్రమంలో ఆ బోగీలో అతనికి చాలా ఎలుకలు సంచరిస్తూ కనిపించడంతో షాకయ్యాడు. ఈ ఘటనను అతను వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తాను సౌత్ బీహార్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్నానని, A1 కోచ్‌లో చాలా ఎలుకలు ఉన్నాయని, అంత డబ్బులు చెల్లించి ఏసీ టికెట్ కొనుక్కుంది ఇందుకేనా అంటూ క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఏసీ కోచ్‌లో ఎలుకలేంటీ.. విచిత్రం కాకపోతేనూ.. అని కొందరు.. ఏసీ టికెట్‌కి ఎలుకలు ఫ్రీ అనుకుంటా అని ఇంకొకరు భిన్నరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల.. వణుకు పుట్టిస్తున్న వీడియో
ఇదికదా టెక్నాలజీ అంటే.. అతని తెలివికి హ్యాట్సాఫ్ వీడియో