బరువు తగ్గాలని అన్నం తినడం మానేసిన యువతి.. చివరకు వీడియో
ఆ అమ్మాయికి 19 ఏళ్లు. చూసేందుకు సన్నంగా ఉంటుంది. కానీ భవిష్యత్తులో బరువు పెరుగుతానేమోనన్న భయంతో ఏడాదిగా ఆహారం తినడం మానేసింది. చాలా తక్కువ మొత్తంలో మాత్రమే ఆహారం తీసుకునేది. ఆన్‌లైన్ లో సూచించిన డైట్‌లను తీసుకునేది. వాటర్ డైట్ ఫలితంగా పూర్తిగా బక్కచిక్కిపోయి కనీసం నడిచేందుకు కూడా ఓపిక లేకుండా తయారైంది. దీంతో 10 రోజుల క్రితమే తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకురాగా.. వైద్యులు చికిత్స అందించారు. కానీ అప్పటికే ఆహారం లేక శరీరంలోని అనేక అవయవాలు పాడయ్యాయి. ఫలితంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది.
అయితే బాలిక అలా భయపడడమే ఓ వ్యాధి అని.. దాని వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు చెబుతున్నారు. కేరళ కన్నూర్ లోని మేరువాంబాయికి చెందిన 19 ఏళ్ల శ్రీనంద.. మట్టన్నూర్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే చిన్నప్పటి నుంచి బక్కగానే ఉన్న శ్రీనంద పూర్తి ఆరోగ్యంగా ఉండేది. కానీ గత ఏడాది కాలంగా ఆమె బరువు పెరుగుతానేమోనని భయపడింది. ఆ భయమే ఎక్కువ కాగా.. ఆహారం తీసుకోవడం మానేసింది. పూర్తిగా కాకపోయినా వీలైనంత తక్కువే తినడం ప్రారంభించింది. తల్లిదండ్రులు ఈ విషయం గుర్తించి పలుమార్లు హెచ్చరించినా వారికి తెలియకుండా పెట్టుకున్న ఆహారం పడేసేది. వైద్యులు ఆమెకు అనోరెక్సియా నెర్వోసా అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధి వల్ల.. మనుషులు సన్నగా ఉన్నా సరే బరువు పెరుగుతామని భయపడిపోతారని.. అది తీవ్రమైతే పూర్తిగా ఆహారం తీసుకోవడం మానేస్తారని చెప్పారు.ఇందుకు సైకియాట్రిస్ట్ దగ్గర చికిత్స తీసుకోవాలని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం :
గుడ్డును మింగిన పాము.. కక్కలేక మింగలేక…చివరికి.. వీడియో
రాజకీయాల నుంచి సినిమాల్లోకి జగ్గారెడ్డి వీడియో
సెల్‌ఫోన్ ఎఫెక్ట్.. ఆ తల్లి చేసిన నిర్వాకం చూస్తే.. వీడియో