చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు నాగబాబు ఎంత అప్పు ఉన్నారో తెలుసా..?
ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ నేత నాగబాబు నామినేషన్ దాఖలు చేసారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో నాగబాబు తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. 70 కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించిన నాగబాబు.. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులూ లేవని స్పష్టం చేశారు. అయితే.. మెగా ఫ్యామిలీ గురించి ప్రతి చిన్న విషయాన్ని ఆసక్తిగా చర్చించే అభిమానులకు నాగబాబు అఫిడవిట్‌లో డిక్లేర్ చేసిన ఆస్తులు, అప్పులపై ప్రస్తుతం చర్చిస్తున్నారు.
చిరంజీవి, పవన్ దగ్గర నాగబాబు అప్పు తీసుకున్నట్టు ప్రకటించడం మరింత ఆసక్తి రేపింది. రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత తొలిసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నాగబాబు 70 కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించారు. మెగా బ్రదర్‌గా సినీ, టీవీ రంగాల్లో పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న ఆయన తన ఆస్తులను అఫిడవిట్‌లో తెలిపారు. ఆయన చరాస్తుల విలువ 59 కోట్లు. నాగబాబు దగ్గర బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, నగదు కలిపి 59 కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉన్నాయి.ఇందులో రూ.55.37 కోట్లు మ్యూచువల్ ఫండ్స్/బాండ్ల రూపంలో ఉండగా చేతిలో నగదు – రూ.21.81 లక్షలుగా ఉంది. బెంజ్ కారు, హ్యుందాయ్ కారు తన సొంత కార్లని , 57.99 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఉన్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ పరిసరాల్లో 11 కోట్ల స్థిరాస్తులున్నాయనీ తెలియజేశారు.
మరిన్ని వీడియోల కోసం :