పవన్ కళ్యాణ్ పై బంగారం హీరోయిన్ క్రేజీ ట్వీట్
జన సేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు బాగా వైరలయ్యాయి. ఈ సందర్భంగా తన చిన్నప్పటి రోజులను మళ్లీ గుర్తు చేసుకున్నారు పవన్. అలాగే రాజకీయాల్లో తాను ఎదుర్కొన్న అవమానాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం హిందీ భాషను అడ్డుకుంటున్న తీరుపై పవన్ తీవ్రంగా మండి పడ్డారు.
రూపీ సింబల్‌ను కూడా రద్దు చేసి కొత్తది ప్రవేశ పెట్టుకున్న స్టాలిన్ ప్రభుత్వ తీరుపై సటైర్లు వేశాడు. అయితే డీలిమిటేషన్ విధానం గురించి పవన్ మాట్లాడిన తీరుపై భిన్నరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చాలామంది పవన్ తీరును మెచ్చుకుంటుంటే ప్రకాశ్ రాజ్ లాంటి మరికొందరు మాత్రం పవర్ స్టార్ కామెంట్స్ ను ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రా పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్ దమ్మున్న నాయకుడని ప్రశంసించింది మీరా చోప్రా. కేవలం గట్స్ మాత్రమే కాదు.. తెలివి, బుద్ది, జ్ఞానం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ ఆయనను తెగ పొగిడేసింది. ప్రస్తుతం మీరా చోప్రా ట్వీట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: