Anasuya: ఆంటీ అంటావా? దమ్ముంటే స్టేజ్‌పైకి రారా?
స్టార్ యాంకర్ అనసూయ ఈ మధ్యన సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అడపా దడపా మాత్రమే టీవీషోల్లో సందడి చేస్తుంటుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. తన సోషల్ మీడియా పోస్టులపై ట్రోల్స్ వచ్చినా అస్సలు వెనక్కు తగ్గదీ అందాల తార.
తనను విమర్శించే వారికి తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. మార్చి 15 శుక్రవారం దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ వేడుకల్లో భాగమయ్యారు. తమ కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి రంగుల పండగలో మునిగి తేలారు. అలా అనసూయ కూడా ఒక హోలీ ఈవెంట్ లో పాల్గొంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్‌గా వెళ్లిందామె. అయితే అక్కడ ఓ ఆకతాయి అనసూయను ఆంటీ అని పిలిచాడు. అంతే.. ఆ మాట చెవిన పడటంతో అనసూయకు చిర్రెత్తిపోయింది. అందరి ముందే ఆ ఆకతాయికి స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది. దమ్ముంటే స్టేజీపైకి రా అని సవాల్ విసిరింది. అంతేకాదు రెచ్చగొడితే ఎలా ఉంటుందో చూపిస్తా అని ధమ్కీ ఇచ్చింది. ఏంటీ భయంతో ప్యాంటు తడిసిపోతుందా? అయితే వాష్‌రూమ్‌కు వెళ్లు అన్నట్లుగా సైగ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఇక ఈ వీడియోను చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యో.. బిర్యానీ ఎంతపని చేసింది.. 8 గంటల పాటు ఆపరేషన్..
కిమ్ రాక్షస పాలన.. చివరికి అది కొనాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే
విశాఖ బీచ్‌లో అరుదైన పీతలు! ఎక్కడి నుంచి వచ్చాయంటే
గర్ల్స్ హాస్టల్‌లో అనుమానాస్పద వస్తువు.. ఏమిటా అని చూసినవాళ్లకు షాక్
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్‌గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

