అయ్యో.. బిర్యానీ ఎంతపని చేసింది.. 8 గంటల పాటు ఆపరేషన్..
బిర్యానీ తినాలనిపించి కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లింది ఓ మహిళ. అక్కడ అందరికీ బిర్యానీ ఆర్డర్ చేసింది. కొన్ని నిమిషాల్లోనే వేడి వేడి బిర్యానీ వారిముందు ప్రత్యక్షమైంది. అందరూ హ్యాపీగా బిర్యానీ తిన్నారు. ఈ క్రమంలో ఆ మహిళకు ఓ ఎముక గొంతులో ఇరుక్కుపోయింది. అది బయటకు రాక ఇబ్బంది పడుతుంటే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ వైద్య సిబ్బంది సీటీ స్కాన్ తీయాలని చెప్పారు. అందుకు అంగీకరించని మహిళ ఇంటికి వెళ్ళిపోయింది. ముంబయికి చెందిన రూబీ షేక్ ఫిబ్రవరి 3న కుటుంబంతో కలిసి ఓ రెస్టారెంట్‌కి వెళ్లింది. అక్కడ బిర్యానీ తింటున్న ఆమెకు గొంతులో ఎముక ఇరుక్కోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. వైద్యులు సిటి స్కాన్ చేయాలని చెప్పగా వద్దని ఇంటికి వెళ్లిపోయిన రూబీకి రెండు రోజుల తర్వాత తీవ్రమైన జ్వరం వచ్చింది. బీపీ కూడా పెరిగిపోయింది. దీంతో మళ్లీ ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు ఎక్స్‌రే, సిటి స్కాన్ చేశారు. గొంతులో ఇరుక్కున్న ఎముకను చూసి ఆపరేషన్ చేయాలని సూచించారు. దాంతో చేసేది లేక ఆపరేషన్‌కు ఒప్పుకుంది. ఈ క్రమంలో 8 గంటలు శ్రమించి ఆపరేషన్ చేసి ఎముకను బయటకు తీశారు వైద్యులు. గొంతులోకి చేరిన ఆహారం ఏదైనా కిందికి జారుతుందని, అందుకు విరుద్ధంగా ఈ ఘటనలో ఎముక గొంతు పైభాగం నుంచి ప్రయాణించిందని, బిర్యానీ తింటున్నప్పుడు రూబీ దగ్గడం వల్ల ఎముక పైకి జరిగి గొంతులో గుచ్చుకొని ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కిమ్ రాక్షస పాలన.. చివరికి అది కొనాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే
విశాఖ బీచ్‌లో అరుదైన పీతలు! ఎక్కడి నుంచి వచ్చాయంటే
గర్ల్స్ హాస్టల్‌లో అనుమానాస్పద వస్తువు.. ఏమిటా అని చూసినవాళ్లకు షాక్

అప్పుడు జుట్టు.. ఇప్పుడు గోర్లు ఊడిపోతున్నాయి.. ఆ గ్రామాలకేమైంది

కొడుకు గాయపడితే తండ్రికి ఆపరేషన్.. ఏకి పారేస్తున్న నెటిజన్స్

మొన్న అల్లుడితో అత్త.. ఇప్పుడు కూతురి మామతో మహిళ జంప్

తాటి ముంజలు ఇష్టంగా తింటున్నారా?

పెళ్లి పీటలపై వధువు స్థానంలో ఆమె తల్లి..షాకైన పెళ్లికొడుకు తర్వాత

వామ్మో.. బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాలు వీడియో

రథోత్సవంలో అపశృతి.. కూలిన పై కప్పు ఏం జరిగిందంటే? వీడియో
