విమానంలో సూది గుచ్చుకున్న వ్యక్తికి..రూ. 15 లక్షలు నష్టపరిహారం
విమాన ప్రయాణాల్లో కొందరికి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. తోటి ప్రయాణికుల ప్రవర్తన ఇబ్బందికరంగా ఉండటం లేదా సిబ్బంది అందించే సౌకర్యాల్లో లోపాలు.. ఇలా ఎన్నో ఉంటాయి. కానీ, చైనాకు చెందిన ఓ వ్యక్తికి సీటులో సిరింజ్‌లో వాడేసిన సూది గుచ్చుకోవడంతో ఏకంగా ఆ ఎయిర్‌లైన్స్‌పై పరిహారం కోసం దావా వేశాడు. ఈ ఘటన చైనా సదర్న్ ఎయిర్‌లైన్స్‌లో జరిగింది. ఇటీవల ఫు అనే వ్యక్తి విమానంలో ప్రయాణించాడు.
సీటులో కూర్చునప్పుడు తన ప్యాంట్ జేబులో నుంచి సెల్‌ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అతడి వేలికి పదునైన వస్తువు ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది. దాన్ని ఇన్సులిన్ ఇంజక్షన్‌కు వాడిన సూదిగా గుర్తించాడు. వెంటనే సిబ్బందికి ఆ విషయాన్ని తెలియజేశాడు. వారు అతడి గాయానికి ప్రథమ చికిత్స చేశారు. గతంలో ఆ సీటులో కూర్చున్న ఓ ప్రయాణికుడు ఇంజక్షన్‌ను అక్కడే వదిలి వేసినట్లు దర్యాప్తులో తేలిందని మీడియా కథనాలు తెలిపాయి. ల్యాండింగ్ తర్వాత బాధితుడికి టికెట్ ధరను వాపస్ ఇవ్వడంతో పాటు అదనంగా కొంత మొత్తాన్ని అందించింది. కానీ, ఈ ఘటన ద్వారా తాను ఎంతో మానసిక క్షోభకు గురయ్యానని.. అంతేకాకుండా, భవిష్యత్తులో అవసరమైతే చికిత్సకు ఖర్చును కూడా ఎయిర్‌లైన్స్ భరించాలని అందుకు 1,30,000 యువాన్లు అంటే 15 లక్షల రూపాయలకు పైగా చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీన్ని సంస్థ నిరాకరించింది. దీంతో అతడు న్యాయస్థానంలో దావా వేశాడు. ఆ తర్వాత సదరు సంస్థ బాధితుడి డిమాండ్లను అంగీకరించినట్లు కథనాలు వచ్చాయి. అంతేకాకుండా, జరిగిన తప్పిదానికి క్షమాపణలు కోరింది. ప్రయాణికులకు ఎలాంటి హాని కలిగించకుండా పరిశుభ్రత విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామనీ బాధితుడిని క్షమాపణలు కోరామనీ అతడి వైద్య ఖర్చులను కూడా భరిస్తామనీ అని ఓ ప్రకటనలో తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం :
రన్యారావుకు కోర్టులో షాక్.. ఏమైందంటే వీడియో
ఆనందంగా పెళ్లి ఊరేగింపు..అంతలోనే ప్రమాదం వీడియో

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్‌ను అభినందించాల్సిందే

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో

అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో

కారుల్లో వస్తారు.. రెక్కీ నిర్వహిస్తారు ఆ తర్వాత వీడియో

యువకుడి ఐడియా అదుర్స్.. ఏసీ కూడా పనికి రాదు వీడియో
