ఆనందంగా పెళ్లి ఊరేగింపు..అంతలోనే ప్రమాదం వీడియో
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎక్కడ చూసినా పెళ్లి భాజాలు వినిపిస్తున్నాయి. పెళ్ళంటే బంధువుల, స్నేహితుల సందడి మామూలుగా ఉండదు. పెళ్లిలో ముఖ్యమైన ఘట్టం భరాత్. వధూవరులను ఊరేగిస్తూ చిన్నా, పెద్దా అంతా డాన్సులు చేస్తారు. అలా సందడిగా సాగుతున్న ఓ పెళ్లి ఊరేగింపులో ఊహించని విధంగా ప్రమాదం చోటుచేసుకుంది. వధూవరులు కూర్చున్న కారు ఒక్కసారిగా నృత్యం చేస్తున్నవారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. దీంతో పెళ్లింట విషాదం అలముకుంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని శంకరపట్నం మండలం మెట్ పల్లి గ్రామానికి చెందిన నవ్య, అశోక్ ల వివాహాన్ని ఘనంగా జరిపించారు. అప్పగింతల తంతు ముగిసిన తరువాత వధూవరులను సాగనంపే కార్యక్రమంలో భాగంగా భరాత్ నిర్వహించారు. మేళతాళాల మధ్య వధూవరులు కూర్చున్న కారు ముందు బంధువులు, కుటుంబ సభ్యులు సంతోషంగా నృత్యాలు చేస్తున్నారు. ఊరేగింపు జరుగుతున్న సమయంలో కారులో డ్రైవర్ కాకుండా వేరే వ్యక్తి డ్రైవింగ్ సీట్లో కూర్చుని గేర్ వేసి ఉన్న కారును స్టార్ట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పి ఊరేగింపులో పాల్గొన్న వారిమీదుగా దూసుకెళ్లింది. మార్చ్ 6న రాత్రి జరిగిన ఈ ఘటనలో 20 మంది గాయపడ్డారు. వారిని వెంటనే జమ్మికుంట, హుజురాబాద్ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఉమ అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనపై శంకరపట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఒక్కసారిగా బోటులోకి వచ్చిపడ్డ పెద్ద డాల్ఫిన్ .. తర్వాత వీడియో
ఇదికదా తల్లి ప్రేమంటే.. పిల్లి తన బిడ్డ కోసం ఏం చేసిందంటే వీడియో
పెళ్లికి ఒక రోజు ముందు వరుడు జంప్.. వీడియో
యుద్ధ విమానాలు వద్దట..ట్రంప్ వెనక్కి తగ్గడం వెనుక కారణం ఏంటి?వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
