Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదికదా తల్లి ప్రేమంటే.. పిల్లి తన బిడ్డ కోసం ఏం చేసిందంటే వీడియో

ఇదికదా తల్లి ప్రేమంటే.. పిల్లి తన బిడ్డ కోసం ఏం చేసిందంటే వీడియో

Samatha J

|

Updated on: Mar 10, 2025 | 9:02 PM

సృష్టిలో తల్లి ప్రేమను మించింది లేదు అంటారు. తల్లి తన బిడ్డలకోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది.. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. తన బిడ్డలకు ఏదైనా చిన్న ఆపద వచ్చినా తల్లడిల్లిపోతుంది. అలాగే తన బిడ్డల ప్రతి అవసరాన్నీ తీర్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తుంది. ఇది కేవలం మానవుల్లేనే కాదు.. పశుపక్ష్యాదుల్లోనూ ఉంటుంది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఒక పిల్లి తన పిల్లలకు ఆటవస్తువులు తెచ్చించేందుకు పడిన తపన అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ పిల్లిని చూస్తుంటే ముచ్చటేస్తుంది అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

సాధారణంగా చిన్న పిల్లలు ఆడుకునేందుకు తల్లి ఆటబొమ్మలు తెచ్చి ఇస్తుంది. ఈ పిల్లి ఏ తల్లిని చూసి ఇన్‌స్పైర్‌ అయిందో కానీ.. తన పిల్లలకు కూడా ఆడుకోడానికి బొమ్మలు తెచ్చివ్వాలనుకుంది. మొత్తానికి ఎక్కడో ఓ టెడ్డీబేర్‌ను సంపాదించింది. ఆ టెడ్డీబేర్‌ను నోటకరుచుకొని.. తన పిల్లలవద్దకు బయలుదేరింది. రెండు గోడల మధ్య ఉన్న చిన్న మురుగు కాలువ మీదుగా ఆ పిల్లి వెళ్తోంది. ఈ క్రమంలో రెండు గోడల మధ్య ఉన్న కాలువకి ఉన్న చిన్న గట్టుమీద నడిచ వెళ్తుంటే మధ్యలో స్తంభాలు అడ్డొస్తూ ఉన్నాయి. పాపం ఆ స్తంభాలను తప్పించుకోడానికి ఆ కాలువ గట్టుమీద అటు ఇటూ దూకుతూ ఎంతో కష్టపడి ఆ టెడ్డీ బేర్‌ను తన పిల్లల వద్దకు తీసుకెళ్లింది. టెడ్డీ బేర్‌ను చూడగానే పిల్లి పిల్లలు కూడా దాని చుట్టూ చేరి సంతోషంగా ఆడుకున్నాయి. వాటి ఆనందం చూసి తల్లి పిల్లి తన కష్టాన్నంతా మర్చిపోయి మురిసిపోయింది. ఇలా పిల్లి తన పిల్లలు ఆడుకునేందుకు టెడ్డీ బేర్‌ను అందించి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. మనిషైనా.. పశుపక్ష్యాదులైనా తల్లి తల్లే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఆ ప్లాస్టిక్‌ ఇడ్లీలు తింటున్నారా?ఎంత డేంజర్‌లో ఉన్నారో తెలుసా వీడియో

త్వరలో.. భూమ్మీదకు సునీతా విలియమ్స్‌.. చిన్న పెన్సిల్ ఎత్తాలన్నా కష్టమేనా?

ఒక్క క్లిక్‌తో .. మీ చరిత్ర మొత్తం చెప్పేస్తుంది!