Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలో.. భూమ్మీదకు సునీతా విలియమ్స్‌.. చిన్న పెన్సిల్ ఎత్తాలన్నా కష్టమేనా?

త్వరలో.. భూమ్మీదకు సునీతా విలియమ్స్‌.. చిన్న పెన్సిల్ ఎత్తాలన్నా కష్టమేనా?

Samatha J

|

Updated on: Mar 09, 2025 | 3:16 PM

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ భూమి మీదకు వచ్చే తేదీపై నాసా ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్న వారిద్దరు మార్చి 19న భూమి మీదకు వస్తారని నాసా తెలిపింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ క్రూ-9 మిషన్ ద్వారా తిరిగి భూమి మీదకు రానున్నారు. మైక్రోగ్రావిటీ ఉండే పరిసరాలలో సునీతా విలియమ్స్‌ తొమ్మిది నెలలుగా ఉండడంతో ఆమెకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి.

తాజా నివేదిక ప్రకారం.. సునితా విలియమ్స్ కు ఎముక సాంద్రత తీవ్రంగా తగ్గింది. అలాగే, కంటి సమస్యలు, ఇమ్యూనిటీ బలహీనతతో ఆమె బాధపడుతున్నట్లు తెలిసింది. అంతరిక్షంలో ఉండే మైక్రోగ్రావిటీలో ఎక్కువ కాలం ఉంటే శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాలు పడతాయి. తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలు ఎదురయ్యే ముప్పు ఉంటుంది. దీన్ని బట్టి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై నిపుణులు వివిధ రకాలుగా చెబుతున్నారు. సునీతా విలియమ్స్‌ కండరాల బలహీనతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మనిషి శరీరం చాలా కాలం పాటు మైక్రోగ్రావిటీకి గురైనప్పుడు కండరాలు బరువును భరించలేవు. దీంతో కండరాల బలహీనతకు మసిల్‌ ఎట్రోపీకి ఇది దారి తీస్తుంది. కాళ్లు, తొడల వెనుక భాగంతో పాటు మరికొన్ని భాగాల్లో ఈ సమస్యలు ఎదురవుతాయి. ఇన్ని నెలల పాటు అక్కడ ఉన్నవారిలో ఎముకల సాంద్రత తగ్గుతుంది. దీంతో ఫ్రాక్చర్ల ముప్పు అధికమవుతుంది. వ్యోమగాములు స్పేస్‌లో నెలకు 1 నుంచి 2 శాతం ఎముకల సాంద్రతను కోల్పోతారని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు. న్యూరోవెస్టిబ్యులర్ సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. అధిక రేడియేషన్‌ ఉన్న వాతావరణంలో ఉండటంతో క్యాన్సర్‌ వచ్చే అవకాశాన్ని తోసిపుచ్చలేమంటున్నారు నిపుణులు.

మరిన్ని వీడియోల కోసం :

ప్రభాస్ పై తప్పుడు వార్తలు.. హీరో సీరియస్ వీడియో

డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె వీడియో

ఇద్దరి ప్రాణాలను తీసిన ‘వాట్సాప్‌ ముద్దు’.. అసలేమైదంటే? వీడియో

చెల్లి పెళ్లికి అన్న షాకింగ్ గిఫ్ట్.. అతిథులతో కన్నీళ్లు పెట్టించిన కానుక వీడియో