ఒక్కసారిగా బోటులోకి వచ్చిపడ్డ పెద్ద డాల్ఫిన్ .. తర్వాత వీడియో
మత్సకారులు సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు విచిత్ర సంఘటన ఎదురైంది. వారి పడవ సముద్రం మధ్యలో ఉండగా ఊహించని ఘటన జరిగింది. ఓ పెద్ద డాల్ఫిన్ అమాంతం ఎగిరొచ్చి వీరి బోటులో పడింది. అసలే చిన్నబోటు కావడంతో.. డాల్ఫిన్ పడగానే బోటు ధ్వంసమైంది. మత్స్యాకారులతోపాటు డాల్ఫిన్ కూడా గాయపడింది. ఈ ఘటన న్యూజిల్యాండ్‌లో జరిగింది.
న్యూజిలాండ్‌కు చెందిన ముగ్గురు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. వారు ప్రయాణిస్తున్న చిన్న చేపల బోటులోకి 400కిలోల బరువైన ఓ పెద్ద డాల్ఫిన్ ఒక్కసారిగా ఎగిరి వచ్చి పడింది. గాల్లోంచి ఎగిరిపడ్డ డాల్ఫిన్ ధాటికి ఆ ముగ్గురు మత్స్యకారుల్లో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. డాల్ఫిన్ తాకిడికి పడవ తీవ్రంగా దెబ్బతింది. డాల్ఫిన్‌కు కూడా గాయాలయ్యాయి. అక్కడ ఏం జరిగిందో కాసేపు వారికి ఏమీ అర్థం కాలేదు. ఆకాశంలోంచి ఏదో వచ్చి మీదపడిందా అన్న అనుభూతి కలిగింది. మత్స్యకారులు వెళ్తున్న పడవ తీవ్రంగా దెబ్బతినటంతో న్యూజిలాండ్ కన్వర్సేషన్ ఏజెన్సీని సాయం కోరారు. రంగంలోకి దిగిన కన్వర్సేషన్ ఏజెన్సీ డాల్ఫిన్ సహా మత్స్యకారులను మరో బోటు ద్వారా తీరానికి చేర్చారు. ఆ సమయంలో డాల్ఫిన్‌ను తడిగా ఉంచడం కోసం వాటర్ ఫ్లష్ సాయంతో నీటిని చల్లారు. తీరం చేర్చాక డాల్ఫిన్‌కు వైద్యం అందించి తిరిగి సముద్రంలోకి వదిలేశారు.
మరిన్ని వీడియోల కోసం :
ఆ ప్లాస్టిక్ ఇడ్లీలు తింటున్నారా?ఎంత డేంజర్‌లో ఉన్నారో తెలుసా వీడియో
త్వరలో.. భూమ్మీదకు సునీతా విలియమ్స్.. చిన్న పెన్సిల్ ఎత్తాలన్నా కష్టమేనా?
ఒక్క క్లిక్‌తో .. మీ చరిత్ర మొత్తం చెప్పేస్తుంది!

చేతిరాత బడ్జెట్టును ప్రవేశపెట్టిన మంత్రి వీడియో

బీరువాలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా గుండె గుబేల్!

చిన్నారి ప్రాణం తీసిన పల్లీగింజ వీడియో

విమానంలో సూది గుచ్చుకున్న వ్యక్తికి..రూ. 15 లక్షలు నష్టపరిహారం

అయ్యో.. బిర్యానీ ఎంతపని చేసింది.. 8 గంటల పాటు ఆపరేషన్..

కిమ్ రాక్షస పాలన.. చివరికి అది కొనాలన్నా అనుమతి కావలి

విశాఖ బీచ్‌లో అరుదైన పీతలు! ఎక్కడి నుంచి వచ్చాయంటే
