యుద్ధ విమానాలు వద్దట..ట్రంప్ వెనక్కి తగ్గడం వెనుక కారణం ఏంటి?వీడియో
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దూకుడు పెంచారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ.. వారిని బలవంతంగా స్వదేశాలకు పంపిస్తున్నారు. చేతులకు సంకెళ్లు వేసి ప్రత్యేక సైనిక విమానాల ద్వారా తరలిస్తున్నారు. విపరీతంగా డబ్బులు ఖర్చు చేసి మరీ ట్రంప్ సైనిక విమానాల్లోనే అక్రమ వలసదారుల తరలింపు ఆపరేషన్ చేపట్టారు. తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ముఖ్యంగా సైనిక విమానాలను నిలిపివేసి సాధారాణ విమానాల ద్వారానే వలసదారులను పంపించాలని చూస్తున్నారట. ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపించేందుకు అమెరికా రెండు సీ-17, రెండు సీ-130 సైనిక విమానాలను వాడుతోంది. అయితే సీ-17 విమానా నిర్వహణ ఖర్చు గంటకు 21 వేల డాలర్లు. అలాగే సీ-130 విమానానికి గంటకు 38 వేల నుంచి 71 వేల డాలర్ల ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన సీ-17 విమానానికి ఒక రోజుకు 5 లక్షల డాలర్లు అవుతుండగా, సీ-130 విమానానికి 16 నుంచి 17 లక్షల డాలర్లు ఖర్చు అవుతుంది. ముఖ్యంగా గ్వాటెమాలా, పెరూ, హోండూరస్, గ్వాంటనమో బే జైలుకు అమెరికా వందల మంది అక్రమ వలసదారులను పంపించింది. ఒక్క గ్వాటెమాలాకు పంపించేందుకే ఒక్కో వ్యక్తికి 4, 675 డాలర్లు ఖర్చు చేసింది. అయితే సాధారణ విమాన టికెట్ ధర 853 డాలర్లు కాగా.. ఇది ఐదు రెట్లు ఎక్కువ. ఐసీఈ చార్టర్డ్ విమానాల కంటే కూడా ఈ సైనిక విమానాల ఖర్చు చాలా ఎక్కువ. మూడు విమానాల్లో అనేక మంది అక్రమ వలసదారులను అమెరికా భారత్ కు తరలించింది. అయితే ఒక్కో విమానానికి గాను 3 మిలియన్ల డాలర్లు ఖర్చు చేసిందట.
మరిన్ని వీడియోల కోసం :
ఆ ప్లాస్టిక్ ఇడ్లీలు తింటున్నారా?ఎంత డేంజర్‌లో ఉన్నారో తెలుసా వీడియో
త్వరలో.. భూమ్మీదకు సునీతా విలియమ్స్.. చిన్న పెన్సిల్ ఎత్తాలన్నా కష్టమేనా?
ఒక్క క్లిక్‌తో .. మీ చరిత్ర మొత్తం చెప్పేస్తుంది!

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
