Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బు తిరిగిస్తారా? జైలుకు వెళతారా? వీడియో

డబ్బు తిరిగిస్తారా? జైలుకు వెళతారా? వీడియో

Samatha J

|

Updated on: Mar 10, 2025 | 9:01 PM

దేశంలో సంచలనం సృష్టించింది హీరా గోల్డ్ కేసు. బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు కాగా.. అక్టోబరు 2018లో నౌహీరా షేక్‌ను అరెస్ట్ చేశారు. వసూలు చేసిన మొత్తాన్ని నౌహీరా షేక్‌తో పాటు సంస్థలోని ఇతరులు వ్యక్తిగత అవసరాలకు నిధులు మళ్లించినట్లు ఈడీ విచారణలో గుర్తించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ సహా పలు చోట్ల ఈ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నగలు, బంగారం స్కీమ్‌ల పేరుతో 5,600 కోట్ల రూపాయలు వసూలు చేసి.. పెట్టుబడికి 36 శాతం డివిడెంట్ ఇస్తామని నమ్మించి నిలువునా ముంచేశారు. ప్రారంభించిన కొత్తలో డివిడెండ్ చెల్లించి.. భారీగా డిపాజిట్లు సేకరించిన తర్వాత బోర్డు తిప్పేశారు.

ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన నౌహీరా షేక్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. స్కీమ్‌ల పేరుతో రూ.వేల కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించి.. మోసగించిన హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్‌కు సుప్రీం కోర్టు రెండు ఆప్షన్లు ఇచ్చింది. మూడు నెలల్లోగా డిపాజిటర్ల నుంచి సేకరించిన 25 కోట్ల రూపాయలను చెల్లించాలని లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని తేల్చిచెప్పింది. లక్షలాది మంది నుంచి పలు స్కీమ్‌ల పేరుతో 5,600 కోట్ల రూపాయలు వసూలుచేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో బుధవారం నాటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాదితుల నుంచి సేకరించిన రూ.25 కోట్లను 90 రోజుల్లోగా నౌషెరా షేక్ తిరిగి ఇవ్వకుంటే కస్టడీలోకి తీసుకోవాలని ఈడీని ఆదేశించింది.నౌహీరా తరఫున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ కపిల్ సిబల్.. ఆమె వద్ద డబ్బులేవని చెప్పారు. నౌహీరా షేక్ పేరిట ఉన్న అనేక ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. కానీ, వేలానికి ఇబ్బందులు లేని ఆస్తుల జాబితాను ఇవ్వాలని ఆమె న్యాయవాది కోరితే వివరాలను మాత్రం ఇవ్వలేదు. తన పేరుతో కేవలం మూడు ఆస్తులే ఉన్నాయని తెలంగాణలోని రెండింటిని ఈడీ వేలం వేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని నౌహీరా తెలిపారు. హీరా గోల్డ్ కేసులో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ విచారణ కొనసాగుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

ఆ ప్లాస్టిక్‌ ఇడ్లీలు తింటున్నారా?ఎంత డేంజర్‌లో ఉన్నారో తెలుసా వీడియో

త్వరలో.. భూమ్మీదకు సునీతా విలియమ్స్‌.. చిన్న పెన్సిల్ ఎత్తాలన్నా కష్టమేనా?

ఒక్క క్లిక్‌తో .. మీ చరిత్ర మొత్తం చెప్పేస్తుంది!