అమ్మానాన్నతో వెళ్లిన.. లక్ష మంది మెడపై వేలాడే బహిష్కరణ కత్తి వీడియో
డిపెండెంట్ వీసా కింద అమెరికాకు వెళ్లిన వారిలో దాదాపు లక్ష మందికి పైగా భారతీయులు స్వీయ బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అమెరికాలో అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ యంత్రాంగం.. వీసా గడువు ముగిసిన వారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. ఇదే సమయంలో హెచ్-1బీ వీసాదారులకు సంబంధించిన అంశం అనేక మంది భారతీయులను కలవరపాటుకు గురిచేస్తోంది. సుమారు లక్ష మందికిపైగా భారతీయులు అమెరికా బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. డిపెండెంట్ వీసాతో తల్లిదండ్రులతో కలిసి వెళ్లగా.. వీరి వయసు 21 ఏళ్లు నిండటమే తాజా ఆందోళనకు కారణం.
హెచ్1బీ వీసాదారుల పిల్లలు H-4 డిపెండెంట్ వీసా కింద అమెరికాకు వెళ్లచ్చు. మైనర్‌గా వెళ్లిన వీరికి 21 ఏళ్లు నిండే వరకు ఈ వీసా పనిచేస్తుంది. కొత్త వీసా పునరుద్ధరణకు రెండేళ్ల గడువు ఉంటుంది. ఇలా డిపెండెంట్ వీసా గడువు ముగింపు దశకు చేరుకున్న భారతీయ చిన్నారుల సంఖ్య దాదాపు 1.34 లక్షలుగా ఉన్నట్లు సమాచారం. వీసా గడువు ముగిసే వారు ఉన్నత చదువుల కోసం ఎఫ్-1 Student visa వీసా పొందే అవకాశం ఉన్నప్పటికీ.. ఇది అంత ఈజీ ఏమీ కాదు. అంతర్జాతీయ విద్యార్థుల కింద నమోదైతే స్కాలర్‌షిప్ సహా ఇతర ప్రభుత్వ సాయానికి దూరం అవుతామన్న ఆందోళనలో ఉన్నారు. అయితే, వీసా పునరుద్ధరణకు ఉన్న రెండేళ్ల సడలింపు నిబంధనపై న్యాయస్థానాల అభిప్రాయాలు ఆందోళన పెంచుతున్నాయి. ఇప్పటివరకు డిపెండెంట్ చిన్నారులు సహా సరైన పత్రాలు లేని వలసదారులకు డిఫర్‌డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ నిబంధన రక్షణగా ఉండేది. అయితే.. ఇది చట్ట విరుద్ధమని, దీని కింద వర్క్ పర్మిట్ పొందలేరని టెక్సాస్‌లోని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ నిబంధన లేకుంటే ఎంతో మంది భారతీయ పిల్లలు భవిష్యత్తుపై ప్రభావం పడుతుందనే ఆందోళన మొదలైంది. దీనికితోడు వీరి తల్లిదండ్రులు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా.. నిరీక్షణ సమయం అనేక సంవత్సరాలు ఉండటం మరో సమస్యగా మారింది.
మరిన్ని వీడియోల కోసం :
ఒక్కసారిగా బోటులోకి వచ్చిపడ్డ పెద్ద డాల్ఫిన్ .. తర్వాత వీడియో
ఇదికదా తల్లి ప్రేమంటే.. పిల్లి తన బిడ్డ కోసం ఏం చేసిందంటే వీడియో
పెళ్లికి ఒక రోజు ముందు వరుడు జంప్.. వీడియో
యుద్ధ విమానాలు వద్దట..ట్రంప్ వెనక్కి తగ్గడం వెనుక కారణం ఏంటి?వీడియో