పెళ్లికి ఒక రోజు ముందు వరుడు జంప్.. వీడియో
బెంగళూరులో షాకింగ్ ఘటన జరిగింది. పెళ్లి కోసం నగరానికి చేరుకున్న వరుడి కుటుంబం, వివాహ తేదీకి సరిగ్గా ఒక రోజు ముందు రాత్రి చెప్పా పెట్టకుండా పరారైంది. దీంతో వధువు తండ్రి సిటీలోని ఉప్పర్ పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే, వధువు, వరుడు ఇద్దరూ కాలేజీ రోజుల నుంచే స్నేహితులు. ఇద్దరు కలిసి ఫ్రాన్స్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు.
2024 జులైలో భారత్‌కు తిరిగొచ్చిన వధువు, తన బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న రిలేషన్‌షిప్ గురించి తండ్రికి చెప్పింది. తమ పెళ్లికి అంగీకరించాలి కోరింది. దీంతో ఆ ఇద్దరి కుటుంబాల పెద్దలు కూర్చుని చర్చించుకున్నారు. 2024 జులై 13న బెంగళూరులో వారిద్దరి ఎంగేజ్‌మెంట్ హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. వివాహాన్ని మార్చి 2న చేయాలని పెద్దలు నిర్ణయించారు. అనంతరం వధువు ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్లిపోయింది. ఆమె మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరి 17న భారత్‌కు వచ్చింది. పెళ్లికి సంబంధించిన షాపింగ్ కోసం వధువు ఢిల్లీలో ఉండగా, ఆమెను వరుడు కలిసినట్లు తెలిసింది. అతడు బలవంతంగా ఆమెతో శారీరకంగా కలిశాడని అంటున్నారు. “వివాహానికి ముందు వధూవరులు శారీరకంగా కలవడం అనేది యూరోపియన్ కల్చర్” అని వధువుతో వరుడు చెప్పినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు బెంగళూరులోని నందీ క్లబ్‌లో వివాహ వేడుకలను ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 28న సంగీత్ నిర్వహించారు.
మరిన్ని వీడియోల కోసం :
ఆ ప్లాస్టిక్ ఇడ్లీలు తింటున్నారా?ఎంత డేంజర్‌లో ఉన్నారో తెలుసా వీడియో
త్వరలో.. భూమ్మీదకు సునీతా విలియమ్స్.. చిన్న పెన్సిల్ ఎత్తాలన్నా కష్టమేనా?
ఒక్క క్లిక్‌తో .. మీ చరిత్ర మొత్తం చెప్పేస్తుంది!

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
