బీరువాలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా గుండె గుబేల్!
ఈ మధ్య వన్యప్రాణులు తరచూ జనావాసాల్లోకి చొరబడుతూ ప్రజలను పరుగులు పెట్టిస్తున్నాయి. పొలాల్లో, ఇళ్లలో ఎక్కడ చూసినా వీటి సంచారం ఎక్కువైపోయింది. పులులు, చిరుత పులులు, పాములు, వింత జంతువులు సంచరిస్తూ జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఓ పాత ఇనుపసామాన్లు కొట్టులో ఓ పెద్ద కొండచిలువ ఆ దుకాణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హన్మకొండ జిల్లా కమలాపురం మండల కేంద్రంలో తాహిర్ అనే వ్యక్తి పాత ఇనుప సామాన్ల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే తాహిర్ సోమవారం ఉదయం దుకాణం ఓపెన్ చేసి సామాన్లు సర్దుకుంటున్నాడు. ఇంతలో అతనికి వింత శబ్దాలు వినిపించడంతో అక్కడి వాతావరణం కాస్త తేడాగా అనిపించింది అతనికి. అయినా తన పని తాను చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతని దుకాణంలో ఉన్న పాత ఇనుప బీరువా దగ్గర ఏదో కదులుతున్నట్టు అతనికి అనిపించింది. ఏమై ఉంటుందా అని పరిశీలించిన అతనికి గుండె ఆగినంత పనైంది. ఒక్క ఉదుటన అక్కడినుంచి బయటకు వచ్చి పడ్డాడు. బీరువాలో తాహిర్‌కి ఓ పెద్ద కొండచిలువ కనిపించింది. దానిని చూసిన దుకాణంలోని సిబ్బంది కూడా భయంతో బయటకు పరుగులు తీసి, చుట్టుపక్కలవారిని కేకలు వేశారు. కేకలు విని అక్కడికి చేరుకున్న స్థానికులు కొండచిలువను చూసి కంగారు పడ్డారు. కొందరు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దాంతో ఘటనాస్థలికి చేరుకున్న అటవీ సిబ్బంది కొండచిలువను బంధించారు. దానిని సురక్షితంగా తీసుకెళ్ళి సమీపంలోని అటవీప్రాంతంలో వదలిపెట్టారు. దీంతో స్థానికులు, షాప్ సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
రన్యారావుకు కోర్టులో షాక్.. ఏమైందంటే వీడియో
ఆనందంగా పెళ్లి ఊరేగింపు..అంతలోనే ప్రమాదం వీడియో
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

