చిన్నారి ప్రాణం తీసిన పల్లీగింజ వీడియో
మహబూబాబాద్ జిల్లాలో విషాద సంఘటన జరిగింది. గొంతులో పల్లీగింజ ఇరుక్కుని 18 నెలల బాలుడు మృతి చెందాడు.. పల్లిగింజలు గొంతులో ఇరుకోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ బాలున్ని తల్లిదండ్రులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.. కానీ ఫలితం దక్కలేదు. ఈ విషాద సంఘటన గూడూరు మండలం నాయక్ పల్లి లో జరిగింది.
నాయక్ పల్లికి చెందిన వీరన్న – కల్పన దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఏడాదిన్నర వయస్సు గల బాలుడు అక్షయ్ ఫిబ్రవరి 7వ తేదీన ఇంటి వద్ద ఆడుకుంటూ ఇంటి ముందు అరబెట్టిన పల్లి గింజలు తినడానికి ప్రయత్నించాడు. ఆ పలిగింజలు గొంతులో ఇరుక్కుని శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బాలుడు పల్లి గింజలు మింగి ఉంటాడని గమనించిన తల్లిదండ్రులు అక్కడి నుండి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.. కానీ పరిస్థితి విషమించిందని ఎంజిఎంకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో అక్కడి నుండి 108 లో ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటివరకూ ఆడుతూ పాడుతూ కళ్లముందు తిరిగిన చిన్నారి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. స్థానికులను ఈ ఘటన కలచివేసింది.
మరిన్ని వీడియోల కోసం :
రన్యారావుకు కోర్టులో షాక్.. ఏమైందంటే వీడియో
ఆనందంగా పెళ్లి ఊరేగింపు..అంతలోనే ప్రమాదం వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
