కిమ్ రాక్షస పాలన.. చివరికి అది కొనాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే
కఠినమైన ఆంక్షలకు కేరాఫ్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. ఇతని రాక్షస పాలన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒక నియంతలా తన దేశాన్ని పాలిస్తుంటాడు. అక్కడ తాను చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఎవరైనా తన మాట దాటితే .. వారికి భయంకరమైన శిక్షలు విధిస్తాడు. కొవిడ్ పాండెమిక్ సమయంలో కరోనా వచ్చిన ఓ వ్యక్తిని కాల్చి చంపించాడంటే, కిమ్ ఎంతటి క్రూరమైన వ్యక్తో అర్థం చేసుకోవచ్చు.
తన విధానాలకు వ్యతిరేకంగా చిన్న పొరపాటు చేసినా సరే కిమ్ విధించే శిక్షలు దారుణంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని విమర్శలు వచ్చినా ఆంక్షల విషయంలో వెనక్కి తగ్గేదేలేదంటాడు. కిమ్ జోంగ్ ఉన్ ప్రజలపై నిర్భందం ఏ స్థాయిలో అమలుచేస్తారో చెప్పే ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కిమ్ రాజ్యం నుంచి అధికారుల కళ్లుగప్పి పారిపోయి వచ్చిన టిమోతి ఛో అనే పౌరుడు ఉత్తర కొరియాలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను మీడియాతో వెల్లడించారు. ఈ రోజుల్లో పూరిగుడిసెలో కూడా టీవీ, దానికి కేబుల్ కనెక్షన్ కనిపించడం చూస్తూనే ఉంటాం.. కానీ ఉత్తర కొరియాలో మాత్రం ప్రజలు ఎవరైనా టీవీ కొనాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి పొందాలట. టీవీ కొంటే ప్రభుత్వం తరఫున ఓ అధికారి పోలీసులతో కలిసి అతని ఇంటికి వచ్చి రహస్యంగా యాంటెనాలు ఏమైనా దాచారేమోనని సోదాలు చేస్తారట. ఒక్క యాంటెనా మాత్రం ఉంచి మిగతావన్నీ తీసుకెళ్లిపోతారని టిమోతి ఛో చెప్పారు. ఆ యాంటెనాతో ప్రభుత్వ ప్రసారాలు తప్ప ఇతర ప్రోగ్రాంలు ఏవీ రావని వివరించారు. ప్రభుత్వ ప్రోగ్రాంలు అంటే 24 గంటలూ కిమ్ కుటుంబం గురించి, కిమ్ తండ్రి, తాతల గొప్పదనం గురించిన కార్యక్రమాలే ప్రసారం అవుతాయని చెప్పారు. చివరకు జుట్టు కత్తిరించుకోవడానికీ ప్రభుత్వం రూల్స్ పెట్టిందని, స్కూలు పిల్లలు ఒకటి రెండు స్టైల్స్ తప్ప వేరేలా కత్తిరించుకోవడం నిషేధమని వివరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశాఖ బీచ్‌లో అరుదైన పీతలు! ఎక్కడి నుంచి వచ్చాయంటే
గర్ల్స్ హాస్టల్‌లో అనుమానాస్పద వస్తువు.. ఏమిటా అని చూసినవాళ్లకు షాక్
మరోసారి డాన్స్‌తో అదరగొట్టిన సాయి పల్లవి..
చడీచప్పుడు కాకుండా… శ్రీలీలతో లవ్‌స్టోరీ చేస్తున్న అఖిల్
హనీరోజ్ అమాయకురాలేం కాదు.. శరీరాన్ని చూపించి డబ్బులు.. నటి షాకింగ్ కామెంట్స్ !

అప్పుడు జుట్టు.. ఇప్పుడు గోర్లు ఊడిపోతున్నాయి.. ఆ గ్రామాలకేమైంది

కొడుకు గాయపడితే తండ్రికి ఆపరేషన్.. ఏకి పారేస్తున్న నెటిజన్స్

మొన్న అల్లుడితో అత్త.. ఇప్పుడు కూతురి మామతో మహిళ జంప్

తాటి ముంజలు ఇష్టంగా తింటున్నారా?

పెళ్లి పీటలపై వధువు స్థానంలో ఆమె తల్లి..షాకైన పెళ్లికొడుకు తర్వాత

వామ్మో.. బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాలు వీడియో

రథోత్సవంలో అపశృతి.. కూలిన పై కప్పు ఏం జరిగిందంటే? వీడియో
