పైప్‌లైన్‌లో 15 కి.మీ పాకుతూ వెళ్లి.. వీడియో
గతేడాది ఉక్రెయిన్ సైనికులు రష్యా సరిహద్దులు దాటి అక్కడి కస్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఇద్దరి మధ్య పోరాటం కొనసాగుతోంది. ఈ క్రమంలో కీవ్ సైన్యంపై దాడులకు రష్యన్ ప్రత్యేక బలగాలు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాయి. ఓ గ్యాస్ పైప్‌లైన్‌లో దాక్కుని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి మరీ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాయి. ఉక్రెయిన్ సైన్యంతో పాటు రష్యన్ యుద్ధ బ్లాగర్లను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.
గతేడాది ఆగస్టులో ఉక్రెయిన్ సైన్యాలు రష్యాలోని కస్క్‌లో ప్రవేశించాయి. వ్యూహాత్మక సరిహద్దు పట్టణం సుడ్జా సహా దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి. వందలాది మంది స్థానికులను యుద్ధ ఖైదీలుగా బంధించాయి. దీంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యాలో కొంత భూభాగాన్ని ఆక్రమించిన మొట్టమొదటి దేశంగా ఉక్రెయిన్ నిలిచింది. అయితే.. నెలల వ్యవధిలోనే మాస్కో సైన్యం ధాటికి వెనకడుగు వేసింది. దాదాపు 50 వేల మంది రష్యన్, ఉత్తర కొరియా సైనికులు విరుచుకుపడటంతో.. చాలా మంది కీవ్ సైనికులు ప్రాణభయంతో పారిపోయారు.ముఖ్యంగా సుడ్జా పట్టణంలో ఉక్రెయిన్ ఊహించని రీతిలో దాడులు ఎదుర్కొందని క్రెమ్లిన్ అనుకూల బ్లాగర్ యూరి పొడోలియాకా తన పోస్టుల్లో తెలిపారు. కొంత కాలం క్రితం వరకు ఐరోపాకు గ్యాస్ సరఫరా చేసేందుకు ఉపయోగించిన భారీ పైప్‌లైన్‌ను మాస్కో దళాలు ఉపయోగించాయి. పైప్‌లైన్ లోపల దాదాపు 15 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి.. సుడ్జా పట్టణం సమీపంలో ప్రత్యర్థులపై దాడులు చేశాయి. కొంతమంది సైనికులు పైప్‌లైన్‌లో చాలా రోజులు గడిపారు. రష్యన్ సేనలు గ్యాస్ మాస్క్‌లు ధరించి పైపుగుండా వెళ్తున్నట్లు కనిపిస్తున్న ఫొటోలు స్థానికంగా చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
రన్యారావుకు కోర్టులో షాక్.. ఏమైందంటే వీడియో
ఆనందంగా పెళ్లి ఊరేగింపు..అంతలోనే ప్రమాదం వీడియో

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్ను అభినందించాల్సిందే

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో

అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో

కారుల్లో వస్తారు.. రెక్కీ నిర్వహిస్తారు ఆ తర్వాత వీడియో

యువకుడి ఐడియా అదుర్స్.. ఏసీ కూడా పనికి రాదు వీడియో
