AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో సుదీక్ష మిస్సింగ్‌.. ఆ బీచ్‌లో ఏం జరిగి ఉంటుంది?వీడియో

అమెరికాలో సుదీక్ష మిస్సింగ్‌.. ఆ బీచ్‌లో ఏం జరిగి ఉంటుంది?వీడియో

Samatha J

|

Updated on: Mar 15, 2025 | 5:13 PM

అమెరికాలో భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి మిస్సింగ్‌ కలకలం రేపుతోంది. కరేబియన్‌ దేశానికి విహారయాత్రకు వెళ్లిన సుదీక్ష ఓ బీచ్‌ దగ్గర అదృశ్యమైంది. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు.. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుదీక్ష వర్జీనియాలో పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో చదువుకుంటోంది. అయితే, గత వారం ఆమె తన ఫ్రెండ్స్‌తో కలిసి కరేబియన్‌ దేశానికి విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో మార్చి 6న స్థానికంగా ఉన్న రియూ రిపబ్లికా రిసార్ట్‌ దగ్గర బీచ్‌ మిస్‌ అయినట్లు ఫ్రెండ్స్‌ చెబుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా సెర్చింగ్ చేస్తున్నారు.

 అయితే సుదీక్ష ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గత వారం ఆమె తన స్నేహితులతో కలిసి కరేబియన్‌ దేశానికి విహారయాత్రకు వెళ్లారు. ఐదుగురు అమ్మాయిలతో కలిసి డొమినికన్‌ రిపబ్లిక్‌లోని ప్రముఖ పర్యటక పట్టణమైన ప్యూంటా కానా ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో మార్చి ఆరో తేదీన స్థానికంగా ఉన్న రియూ రిపబ్లికా రిసార్ట్‌ వద్ద బీచ్‌ వెంట నడుచుకుంటూ కనిపించారు. ఆ తర్వాత ఆమె తిరిగి రాకపోవడంతో స్నేహితులు ఆందోళనకు గురై పోలీసులను సంప్రదించారు. సముద్ర తీరం వద్ద, సముద్రం లోపల డ్రోన్లు, హెలికాప్టర్లతో గత నాలుగు రోజులుగా ఆమె కోసం వెతుకుతున్నారు. ఇప్పటివరకు ఏ ఆచూకీ లభించకపోవడంతో బహుశా ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సుదీక్ష మిస్సింగ్‌పై ఆమె తండ్రి కోణంకి సుబ్బరాయుడు స్పందించారు. తప్పిపోయిన సుదీక్ష కోసం పోలీసులు గాలిస్తున్నారని సుబ్బరాయుడు చెప్పారు. రిసార్ట్‌ పరిసరాలు, సముద్రం వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా కిడ్నాప్‌, మానవ అక్రమ రవాణా వంటి అవకాశాలను కూడా పరిశీలించాలని పోలీసులను కోరామని సుబ్బరాయుడు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

రన్యారావుకు కోర్టులో షాక్‌.. ఏమైందంటే వీడియో

ఆనందంగా పెళ్లి ఊరేగింపు..అంతలోనే ప్రమాదం వీడియో

ఎగురుతున్న విమానాన్ని వెనక్కి రప్పించిన టాయిలెట్‌ వీడియో

మిమ్మల్ని నేను తీసుకొస్తా… సునీతకు ట్రంప్‌ సందేశం వీడియో

Published on: Mar 15, 2025 05:02 PM