దారుణం! టాప్ 10 లిస్టులో ఒక్క తెలుగు సినిమా లేదా?
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమాల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ IMDB లిస్టులో ప్రముఖంగా స్థానం సంపాదించే మన తెలుగు సినిమాలు ఈ సారి మాత్రం ఈ లిస్టులో టాప్ 10లో నిలబడలేకపోయింది. ఇదే ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లోనూ... బాలీవుడ్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతోంది. 2025 ప్రారంభమై అప్పుడే మూడు నెలలు అయ్యింది.
ఈ క్రమంలోనే ఈ సంవత్సరం అత్యంత ఆసక్తికర చిత్రాల జాబితాను IMDB విడుదల చేసింది. కన్నడ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. యష్ హీరోగా, గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘టాక్సిక్’ రెండో స్థానంలో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ‘టాక్సిక్’ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తర్వాత ఈ జాబితాలో తమిళ చిత్రం ‘జన నాయగన్’ మూడవ స్థానంలో ఉంది. దళపతి విజయ్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదల కానుంది. ఇక నాల్గవ స్థానంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘సికంధర్’ చిత్రం ఉంది. సల్మాన్ ఖాన్ ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయిక. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్ సన్నిహితుడు సాజిద్ నదియాద్వాలా ఈ చిత్రానికి నిర్మాతంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ జాబితాలో ఐదవ స్థానంలో అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ’ చిత్రం ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
ఫుల్‌గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటంటే
నీ ‘సర్’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా
రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే

