AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్లగొండ కోర్టు సంచలన తీర్పు.. ప్రణయ్ కేసులో ఏం జరిగిందంటే వీడియో

నల్లగొండ కోర్టు సంచలన తీర్పు.. ప్రణయ్ కేసులో ఏం జరిగిందంటే వీడియో

Samatha J

|

Updated on: Mar 15, 2025 | 5:02 PM

ప్రేమ ఆ యువకుడి ప్రాణం తీసింది. తక్కువ సామాజికవర్గం వాడిని ప్రేమించి పరువు తీసిందన్న కోపంతో కన్నతండ్రే కూతురికి ఈ దుస్థితిని కల్పించాడు. సుపారీ ఇచ్చి మరీ అల్లుడిని చంపించాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఈ పరువు హత్య కేసుకు సంబంధించి నిందితులందరూ దోషులేనని నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు నిర్థారించింది. యువకుడిని నరికి చంపిన కేసులో ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరే సరి అని తీర్పు చెప్పింది. మిగితా నిందితులకు జీవిత ఖైదు విధించింది. అసలీ కేసులో ఏం జరిగింది?

 2018లో మిర్యాల‌గూడ‌లో జరిగిన ప్ర‌ణ‌య్ పరువు హ‌త్య అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపింది. త‌న కుమార్తె అమృత‌.. ప్ర‌ణ‌య్ను కులాంత‌ర వివాహం చేసుకుంద‌న్న క‌క్ష‌తో ఆమె తండ్రి మారుతీరావు త‌న త‌మ్ముడు శ్ర‌వ‌ణ్ తో క‌లిసి దారుణానికి ఒడిగ‌ట్టాడు. రెండు నెల‌ల పాటు రెక్కీ నిర్వ‌హించి మ‌రీ.. ప‌క్కా ప్లాన్తో సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను దారుణంగా హ‌త్య చేయించాడు. ప‌రువును కాపాడుకునేందుకు అంటూ కూతురి నుదుట బొట్టు చెరిపేశాడు. కూతురు గర్భవతన్న కనికరం లేకుండా అల్లుడి ప్రాణాలు తీశాడు. మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అమృతలు 9వ తరగతి నుంచి స్నేహితులు. వయసు పెరిగేకొద్దీ వారి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ ఇంజనీరింగ్ మధ్యలో ఆపేశారు. వీరి ప్రేమ విషయం తెలియడంతో అమృత తండ్రి మారుతీరావు, బాబాయి శ్రవణ్.. ప్రణయ్ను హెచ్చరించారు. తండ్రికి ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో అమృత 2018 జనవరిలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. జనవరి 31న ఇద్దరూ హైదరాబాద్ లోని ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. అప్పటికి అమ్మాయి, అబ్బాయి వయసు 21 ఏళ్లు. కొన్నాళ్లు హైదరాబాద్ లోనే ఉన్న అమృత – ప్రణయ్ లు తరువాత మిర్యాలగూడకు తిరిగి వెళ్లారు. అమ్మాయి బంధువుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల సూచన మేరకు ఇంటి వద్ద సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

రన్యారావుకు కోర్టులో షాక్‌.. ఏమైందంటే వీడియో

ఆనందంగా పెళ్లి ఊరేగింపు..అంతలోనే ప్రమాదం వీడియో

ఎగురుతున్న విమానాన్ని వెనక్కి రప్పించిన టాయిలెట్‌ వీడియో

మిమ్మల్ని నేను తీసుకొస్తా… సునీతకు ట్రంప్‌ సందేశం వీడియో