Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముసుగులతో వచ్చి..తుపాకీ గురిపెట్టి..వీడియో

ముసుగులతో వచ్చి..తుపాకీ గురిపెట్టి..వీడియో

Samatha J

|

Updated on: Mar 17, 2025 | 7:47 AM

పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఇలా షోరూమ్‌ తెరిచారో లేదో అలా దూసుకొచ్చారు.. తుపాకీలతో బెదిరించి విలువైన బంగారు ఆభరణాలు, నగదు పట్టుకొని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు దొంగలను వెంబడించినా దొరకలేదు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది.బీహార్‌..ఆరాలో ఉన్న బంగారు నగల షోరూమ్‌ను రోజూలాగే మార్చ్‌ 10న ఉదయం 10 గంటలకు తెరిచారు. కాసేపటికే ఓ పదిమంది దుండగులు తుపాకులతో షాపులోనికి చొరబడ్డారు.

 దుండగులు ముఖాలు కనిపించకుండా హెల్మెట్లు, మంకీ క్యాప్‌లు ధరించి, తుపాకీలు చేతబట్టి షాపులోనికి దూసుకొచ్చారు. సెక్యూరిటీ వద్ద ఉన్న తుపాకీని లాగేసుకున్నారు. వారి వద్దనున్న ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి షోరూంలోని రూ.25 కోట్ల విలువైన నగలు, డబ్బును దోచుకెళ్లారు. సిబ్బందిలో ఒకరిపై దాడి చేశారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. దుకాణంలోని సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగులను వెంబడిస్తూ వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు దుండగులు గాయపడ్డారు. అయినా వారు పోలీసులకు చిక్కలేదు. అయితే ఎంత డబ్బు కాజేశారో తెలియాల్సి ఉందని షోరూం మేనేజర్‌ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం :

గుడ్డును మింగిన పాము.. కక్కలేక మింగలేక…చివరికి.. వీడియో

రాజకీయాల నుంచి సినిమాల్లోకి జగ్గారెడ్డి వీడియో

సెల్‌ఫోన్‌ ఎఫెక్ట్‌.. ఆ తల్లి చేసిన నిర్వాకం చూస్తే.. వీడియో

చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు నాగబాబు ఎంత అప్పు ఉన్నారో తెలుసా..?

Published on: Mar 17, 2025 07:44 AM