AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఈ ఏరియాల్లోనే నీళ్ళ కరువు ఎందుకు..? రానున్న రోజులు భయంకరంగా మారనున్నాయా..?

గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నీటి ట్యాంకర్ల సరఫరా 100 శాతం పెరిగింది. ప్రస్తుతం రోజుకు 11 వేల ట్యాంకర్లు సరఫరా అవుతున్నాయి. ఈ వేసవిలో ఇప్పటివరకు 4.5 లక్షల ట్యాంకర్లు పంపిణీ చేశారు. అయితే, ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఈ ట్యాంకర్లలో 4 లక్షలు కేవలం 22,000 మంది పదేపదే బుక్ చేసుకుంటున్నారు. ఈ వినియోగదారులు హైటెక్ సిటీ నుంచి బంజారాహిల్స్ వరకు విస్తరించిన ఉన్నత ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

Hyderabad: ఈ ఏరియాల్లోనే నీళ్ళ కరువు ఎందుకు..? రానున్న రోజులు భయంకరంగా మారనున్నాయా..?
Hyderabad Water
Rakesh Reddy Ch
| Edited By: Balaraju Goud|

Updated on: Mar 18, 2025 | 5:00 PM

Share

రాష్ట్ర రాజధాని భాగ్యనగరం, ఒకప్పుడు నీటి వనరుల సమృద్ధితో ప్రసిద్ధి చెందిన నగరం. కానీ ఇప్పుడు హైదరాబాద్ మహానగరం నీటి ఎద్దడి సమస్యతో అల్లాడుతోంది. రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని, ఏప్రిల్-మే నెలల్లో నీటి కటకట అనూహ్య స్థాయిలో ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఈ సమస్యపై అధ్యయనం చేసింది.

100% పెరిగిన ట్యాంకర్ల సరఫరా

గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నీటి ట్యాంకర్ల సరఫరా 100 శాతం పెరిగింది. ప్రస్తుతం రోజుకు 11 వేల ట్యాంకర్లు సరఫరా అవుతున్నాయి. ఈ వేసవిలో ఇప్పటివరకు 4.5 లక్షల ట్యాంకర్లు పంపిణీ చేశారు. అయితే, ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఈ ట్యాంకర్లలో 4 లక్షలు కేవలం 22,000 మంది పదేపదే బుక్ చేసుకుంటున్నారు. ఈ వినియోగదారులు హైటెక్ సిటీ నుంచి బంజారాహిల్స్ వరకు విస్తరించిన ఉన్నత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో నీటి కొరత ఎంత తీవ్రంగా ఉందంటే, Ikea చుట్టూ 4-5 కిలోమీటర్ల పరిధిలో ఒక్క చుక్క నీరు కూడా భూమిలో ఇంకే పరిస్థితి లేదు.

సిమెంట్ టాపింగ్స్ అభివృద్ధి శాపంగా మారిందా?

అభివృద్ధి పేరుతో నగరంలో వేసిన సిమెంట్ రోడ్లు మరియు టాపింగ్స్ ఇప్పుడు భూగర్భ జలాలకు పెను ముప్పుగా పరిణమించాయంటున్నారు నిపుణులు. వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా ఈ సిమెంట్ పొరలు అడ్డుకుంటున్నాయి. ఫలితంగా, భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోయాయి. ఒకప్పుడు బోర్ల ద్వారా సమృద్ధిగా లభించే నీరు ఇప్పుడు అరుదైన వనరుగా మారింది. Ikea వంటి ప్రాంతాల్లో అంతా సిమెంట్‌తో నిండిపోవడంతో, నీటి రీఛార్జ్ అవకాశం పూర్తిగా తగ్గిపోయింది.

హై-రైజ్ భవనాల నీటి డిమాండ్‌

సిమెంట్ టాపింగ్స్ ఒక్కటే కాదు, నీటి సమస్యకు మరో కారణం హై-రైజ్ భవనాలు. 100 గజాల స్థలంలో 5 నుంచి 8 అంతస్తుల భవనాలు నిర్మించి, ఒక్కో భవనంలో 50 మంది నివసిస్తున్నారు. ఈ భవనాల్లో నీటి వినియోగం అమాంతంగా పెరిగింది. కానీ భూగర్భ జలాలను రీఛార్జ్ చేసే వ్యవస్థలు లేకపోవడంతో సమస్య మరింత జటిలమైంది. ఒక వైపు నీటి లభ్యత తగ్గుతుండగా, మరోవైపు డిమాండ్ పెరుగుతుండటం ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.

ఈ వేసవిలో నీటి కటకట తప్పదా?

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, ఏప్రిల్ – మే నెలల్లో నీటి కొరత మరింత తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ట్యాంకర్లపై ఆధారపడే వారి సంఖ్య పెరుగుతుండటం, భూగర్భ జలాలు ఇంకా అడుగంటుతుండటం ప్రమాదంగా మారింది. హైటెక్ సిటీ, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో నివాసులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పరిష్కారం ఎక్కడ?

రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఈ సమస్యపై కొంత అధ్యయనం చేసినట్లు చెబుతున్నప్పటికీ, ఇంకా ఆచరణ సాధ్యమైన చర్యలు కనిపించడం లేదు. సిమెంట్ రోడ్ల స్థానంలో తారు రోడ్ల వంటి పరిష్కారాలు, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను అమలు చేయడం, హై-రైజ్ భవనాలకు నీటి రీఛార్జ్ వ్యవస్థలను తప్పనిసరి చేయడం వంటి చర్యలు తీసుకుంటే ఈ సమస్యను కొంతవరకు తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..