AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహానగరానికి ముంచుకొచ్చిన ముప్పు… ప్రభుత్వానికి నివేదిక పంపిన జలమండలి

హైదరాబాద్‌కు భూగర్భజల నీటి కరువు ముప్పు ముంచుకొచ్చింది. అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ మహానగరంలో అంతకు రెట్టింపు స్థాయిలో భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతున్నాయి. తాజా సర్వేనే అందుకు నిదర్శనం. ఔటర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 948 చదరపు కిలోమీటర్లలో సాంకేతిక నిపుణులతో జలమండలి జరిపిన సర్వేలో కేవలం 27 చదరపు కిలోమీటర్లు మినహా, మిగిలిన 921 చదరపు కిలోమీటర్లలో భూగర్భ జలాలు ప్రమాద స్థాయిలో

మహానగరానికి ముంచుకొచ్చిన ముప్పు... ప్రభుత్వానికి నివేదిక పంపిన జలమండలి
Hyderabad Water Supply
K Sammaiah
|

Updated on: Mar 18, 2025 | 2:36 PM

Share

హైదరాబాద్‌కు భూగర్భజల నీటి కరువు ముప్పు ముంచుకొచ్చింది. అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ మహానగరంలో అంతకు రెట్టింపు స్థాయిలో భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతున్నాయి. తాజా సర్వేనే అందుకు నిదర్శనం. ఔటర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 948 చదరపు కిలోమీటర్లలో సాంకేతిక నిపుణులతో జలమండలి జరిపిన సర్వేలో కేవలం 27 చదరపు కిలోమీటర్లు మినహా, మిగిలిన 921 చదరపు కిలోమీటర్లలో భూగర్భ జలాలు ప్రమాద స్థాయిలో అడుగంటిపోయినట్లు నివేదిక సమర్పించారు.

హైటెక్ సిటీ మాదాపూర్ శేరిలింగంపల్లి కూకట్పల్లి మిగతా 15 డివిజన్లో అత్యధికంగా నాలుగు లక్షల 50 వాటర్ ట్యాంకులు జలమందలి నుంచి రిపీటెడ్ గా 22,000 మంది బుక్ చేసుకున్నట్లుగా రికార్డులు బయటపడ్డాయి. విచిత్రంగా హైదరాబాద్ చరిత్రలోనే ఎన్నడు లేని విధంగా ఈ విధంగా వాటర్ ట్యాంకులు రిపీటెడ్ గా బుక్ కావడం పట్ల అధికారులు గ్రౌండ్లలో గ్రౌండ్ వాటర్ పై సర్వేలు చేశారు. దీంతో ఈ వాస్తవాలు బయటపడ్డాయి.

హైటెక్‌సిటీ ఏరియాలోని ఐక్యా చుట్టూ దాదాపు 5 కిలోమీటర్ల రేడియస్ లో ఎక్కడ కూడా వర్షం నీళ్లు ఇంకే పరిస్థితి దాదాపుగా లేనట్టుగా అధికారులు గుర్తించారు. గత ఏడాది కంటే ఏడాది వర్షపాతం అధికంగా నమోదైనప్పటికీ ఎక్కడ కూడా వర్షం నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేకుండా సిమెంట్ టాపింగ్ చేయడం ఇంకుడు గుంతలు వంటివి లేకపోవడంతో పడిన వర్షం నీరు అంతా మూసీ నదిలోకి డ్రైనేజీ రూపంలో వెళ్ళిపోతున్నట్లుగా గుర్తించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిరోజు 11 వేల టాంకర్లను నగరవాసులు బుక్ చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే అదనంగా 100% పైగా వాటర్ ట్యాంకులకు డిమాండ్ పెరిగింది. అత్యధికంగా, హైటెక్‌ సిటీ శేర్లింగంపల్లి కూకట్పల్లి నిజాంపేట్ ప్రగతి నగర్ మాదాపూర్ మణికొండ ఎస్సార్ నగర్ ప్రాంతాలలో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్‌ ఉంది. భూగర్భజాలాలు పడిపోవడంతో అపార్ట్మెంట్లో బోర్లు కూడా పనిచేయడం లేదు. జలమండలి వాటర్ ట్యాంకులపైనే ఈ కాలనీలన్నీ ఆధారపడ్డాయి

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు వాటర్ ట్యాంకులను సప్లై చేయడానికి మొత్తం 81 వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లో ఉన్నాయి. అత్యవసర పరిస్థితులు ఏర్పడడంతో మరో 17 వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి జలమండలి రంగం సిద్ధం చేసింది. గత ఏడాది 2024లో మొత్తం హైదరాబాద్ నగరానికి వాటర్ సప్లై చేయడానికి 586 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ప్రస్తుతం 678 వాటర్ ట్యాంకులను జలమండలి వినియోగిస్తుంది. దీనికోసం అధనంగా సిబ్బందిని కూడా జలమండలి నియమించింది.