Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Biryani: ఓర్నాయనో.. బిర్యానీ సగం తిన్నాక షాకింగ్ సీన్.. ప్లేట్‌లో కనిపించింది చూసి..

బీర్యానీ అంటే చాలు లొట్టలేయ్యాల్సిందే.. ఇక నాన్ వెజ్ ప్రియులైతే హైదరాబాద్ బిర్యానీని ముందు వెనుక ఆలోచించడకుండా తినేస్తారు.. ఎందుకంటే.. క్రేజ్ అలాంటిది మరి.. ఏది ఎలా ఉన్నా.. బిర్యానీ టెస్ట్ అలాంటిది మరి.. మంచి మసాలా స్మెల్.. అదుర్స్ అనేలా టేస్ట్.. ఇంకా రుచి సూపర్బ్.. ఇంకేముంది.. ఫస్ట్ తినడమే తరువాయి..

Chicken Biryani: ఓర్నాయనో.. బిర్యానీ సగం తిన్నాక షాకింగ్ సీన్.. ప్లేట్‌లో కనిపించింది చూసి..
Chicken Biryani
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 18, 2025 | 1:47 PM

బీర్యానీ అంటే చాలు లొట్టలేయ్యాల్సిందే.. ఇక నాన్ వెజ్ ప్రియులైతే హైదరాబాద్ బిర్యానీని ముందు వెనుక ఆలోచించడకుండా తినేస్తారు.. ఎందుకంటే.. క్రేజ్ అలాంటిది మరి.. ఏది ఎలా ఉన్నా.. బిర్యానీ టెస్ట్ అలాంటిది మరి.. మంచి మసాలా స్మెల్.. అదుర్స్ అనేలా టేస్ట్.. ఇంకా రుచి సూపర్బ్.. ఇంకేముంది.. ఫస్ట్ తినడమే తరువాయి.. ఇలాంటి బిర్యానీ క్రేజ్‌ను సాకుగా చూపి సొమ్ముచేసుకుంటున్న కొన్ని హోటళ్లు శుచి శుభ్రతను గాలికొదిలేశాయి.. హోటళ్ల యాజమాన్యాలు, రెస్టారెంట్ల నిర్వాహకుల తీరుతో బయట బిర్యానీ, ఫుడ్ తినాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అలానే ఆహార పదార్థాలను సర్వ్ చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.. ఇటీవల ఫుడ్ సెఫ్టీ అధికారులు నిత్యం దాడులు చేస్తున్నప్పటికీ.. ఆహార నాణ్యత విషయంలో హోటల్స్, రెస్టారెంట్ నిర్వాహకులు మాత్రం అలానే వ్యవహరిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫుడ్ తయారీలో ప్రాణాంతక రసాయనాలు, కుళ్లి పోయిన పదార్థాలు ఉపయోగించడం.. అంతే కాకుండా అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఆహారం ఉంచడంతో పురుగులు, బొద్దింకలు కనిపిస్తుండటం ఆందోళనకరంగా మారింది.. తాజాగా హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది..

ఓ వ్యక్తి బిర్యానీ తినేందుకు రెస్టారెంట్‌కు వెళ్లి ఆర్డర్ ఇచ్చాడు.. వెయిటర్ కూడా చకచకా బిర్యానీని సర్వ్ చేయడంతో తినడం మొదలు పెట్టేశాడు.. ఇంతలో ఓ షాకింగ్ సీన్ కనిపించింది.. దీంతో దెబ్బకు కంగుతిన్నాడు.. బిర్యానీలో బొద్దింక కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయి.. వెంటనే రెస్టారెంట్ నిర్వహాకులకు ఫిర్యాదు చేశాడు.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్ సిటీ నడిఒడ్డున గల నెక్లెస్ రోడ్డులో ఉన్న రైల్ కోచ్ రెస్టారెంట్ లోని బిర్యానీలో బొద్దింక దర్శనమివ్వడం కలకలం రేపింది..

వీడియో చూడండి..

విజయ్ అనే వ్యక్తి తన మిత్రులతో కలిసి బిర్యానీ తినేందుకు రైల్ కోచ్ రెస్టారెంట్ కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశాడు. అయితే,వాళ్లు తీసుకొచ్చిన బిర్యానీ సగం తిన్నతర్వాత అందులో బొద్దింక కనిపించింది.. దీంతో ఇదేంటని రెస్టారెంట్ నిర్వాహకులను ప్రశ్నించాడు.. అయితే.. వారి నుంచి సరైన సమాధానం రాలేదని.. దీంతో విజయ్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది..

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..