వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో
మండుతున్న ఎండలను ఎదుర్కోవాలంటే దానికి తగ్గట్టుగా శరీరానికి ఎలక్ట్రోలైట్లు కావాలి. వేసవిని తట్టుకోడానికి, తక్షణ శక్తని పొందేందుకు కొన్ని రకాల పానీయాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించడంలో మజ్జిక కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగులో కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర తరుగు, పుదీనా వేసి బాగా చిలికి పల్చని మజ్జిగలా చేసుకొని తాగితే దప్పిక తీరడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
అలాగే సబ్జాగింజలు కూడా ఎండవేడిని తట్టుకోడానికి బాగా ఉపయోగపడతాయి. వీటిని నీటిలో నానబెట్టి తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరానికి చలువ చేయడమే కాకుండా బాడీ డీహైడ్రేషన్‌కి గురికాకుండా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. వేసవిలో తరచూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరానికి అధికమోతాదులో అవసరమయ్యే ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా అందుతాయి. కొబ్బరి నీళ్లలో ఉండే మెగ్నీషియం, సోడియం, వడదెబ్బనుంచి తట్టుకునే శక్తిని ఇస్తాయి. పండ్ల రసాలు శరీరానికి కావలసిన శక్తినివ్వడమే కాకుండా ఎండవేడినుంచి తట్టుకునేందుకు కూడా సాయపడతాయి. అయితే చక్కెర లేకుండా చేసిన జ్యూస్‌లు తీసుకోవడం మంచిది. లస్సీ శరీరాన్ని వేగంగా చల్లబరుస్తుంది. తేనె, జీలకర్ర, యాలకులు కలిపి చిలికిన లస్సీని తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఎండవేడిమి వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయి. నిమ్మకాయల్లో రోగనిరోధక శక్తిని వేగంగా పెంచే గుణం ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం :
ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల.. వణుకు పుట్టిస్తున్న వీడియో
ఇదికదా టెక్నాలజీ అంటే.. అతని తెలివికి హ్యాట్సాఫ్ వీడియో