AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy Vijay: అభిమానుల కోరిక మేరకు స్టేజ్ పై విజయ్ స్టెప్పులు

Thalapathy Vijay: అభిమానుల కోరిక మేరకు స్టేజ్ పై విజయ్ స్టెప్పులు

Phani CH
|

Updated on: Dec 29, 2025 | 7:54 PM

Share

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ పూర్తిస్థాయి రాజకీయ ప్రవేశం ప్రకటించారు. తన 69వ చిత్రం జన నాయగన్ చివరి సినిమా అని వెల్లడించారు. మలేషియాలో జరిగిన ఆడియో లాంచ్ వేదికగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన విజయ్, ప్రజలకు పూర్తిస్థాయిలో సేవ చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ కింగ్ దళపతి విజయ్ ఇకపై పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారనున్నారు. దశాబ్దాలుగా వెండితెరపై తన నటనతో అభిమానులను అలరించిన విజయ్, సినిమాలకు వీడ్కోలు పలికారు. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఆయన రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. మలేషియాలో జరిగిన జన నాయగన్ ఆడియో లాంచ్ ఈవెంట్ వేదికపై అభిమానుల కోరిక మేరకు స్టెప్పులు వేసిన విజయ్, కాసేపటికే షాకింగ్ ప్రకటన చేశారు. తన 69వ చిత్రమైన జన నాయగన్ తన చివరి సినిమా అని తెలిపారు. సినిమాలకు స్వస్తి చెప్పడం కష్టంగా ఉన్నప్పటికీ, ప్రజలకు పూర్తిస్థాయిలో సేవ చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ ఎమోషనల్ అయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్ వాసులకు మరోసారి ఈగల్ టీమ్ హెచ్చరిక

Srisailam: శ్రీశైలంలో ఆన్ లైన్ విధానానికి భక్తులలో అనూహ్య స్పందన

CM Revanth Reddy: అసెంబ్లీ లో అదిరే సీన్.. KCR దగ్గరకు వెళ్లి పలకరించిన CM రేవంత్ రెడ్డి

న్యూయార్క్, న్యూజెర్సీలో మంచు తుఫాన్ తీవ్రత

బీ అలర్ట్‌.. వచ్చే రెండు రోజులూ వణుకే.. మరింత పడిపోనున్న ఉష్ణోగ్రతలు