సొంత ఇంటి కలను నిజం చేసేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డు దిగువ ఆదాయ వర్గాల కోసం అతి తక్కువ ధరకే ఫ్లాట్లను విక్రయిస్తోంది. గచ్చిబౌలి, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో మొత్తం 339 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. జనవరి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులు లక్ష రూపాయల డిపాజిట్‌తో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.