పదో అంతస్తు నుంచి జారి పడ్డాడు.. కట్ చేస్తే ఈ విధంగా బ్రతికి బయటపడ్డాడు..
గుజరాత్ సూరత్‌లో అద్భుతం జరిగింది. 10వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన ఓ వ్యక్తి, 8వ అంతస్తు కిటికీ గ్రిల్స్‌లో కాలు చిక్కుకుపోవడంతో త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా రక్షించారు. ఈ ధైర్యసాహసాల రెస్క్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికుల సహాయంతో ఆ వ్యక్తి ప్రాణాలు నిలిచాయి.
పదో అంతస్తు నుంచి పడిన ఓ వ్యక్తి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఎనిమిదో అంతస్తులోని కిటికీ గ్రిల్స్ మధ్య అతడి కాలు చిక్కుకుపోవడంతో రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు అతడిని రక్షించగలిగాయి. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సూరత్‌లోని జహంగిర్‌పురాకు చెందిన నితిన్‌భాయ్ అదియా.. అపార్టుమెంటులోని పదో అంతస్తులో కిటికీ పక్కన కునుకు తీస్తున్నారు. ఆ క్రమంలో ప్రమాదవశాత్తు కిందకు జారిపడగా.. ఎనిమిదో అంతస్తులోని కిటికీలో అతడి కాలు చిక్కుకుపోయింది. దీంతో నితిన్ తలకిందులుగా వేలాడారు. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు.. రోప్‌లు, సేఫ్టీ బెల్ట్ సాయంతో అతడిని రక్షించాయి. అదే సమయంలో ముందు జాగ్రత్తగా ఫైర్ సిబ్బంది, స్థానికులు సేఫ్టీ నెట్‌తో కింద సిద్ధంగా ఉన్నారు. చివరకు కిటికీ గ్రిల్స్ నుంచి అతడిని సురక్షితంగా బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తండ్రి మొక్కు తీర్చటానికి కొడుకు నిర్ణయం.. 120 కి.మీ మేర పొర్లుదండాలు పెడుతూ యాత్ర
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
2025లో గూగుల్‌లో ఎక్కువ ఎవరికోసం సెర్చ్ చేసారో తెలుసా ??
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
మత్స్యకారుల వలలో అరుదైన చేపలు.. అబ్బా అదృష్టం అంటే వీళ్లదే
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత

