తండ్రి మొక్కు తీర్చటానికి కొడుకు నిర్ణయం.. 120 కి.మీ మేర పొర్లుదండాలు పెడుతూ యాత్ర
ఇటీవల తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం పెరుగుతున్న వేళ, ఒడిశాకు చెందిన సుశీల్ తన తల్లిదండ్రుల ఆరోగ్యం, తండ్రి మొక్కు కోసం పూరీ జగన్నాథ ఆలయానికి 120కి.మీ పొర్లుదండాల యాత్ర చేస్తున్నాడు. ఈ అసాధారణ భక్తి మార్గం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సుశీల్ త్యాగం కుటుంబ విలువలకు ప్రతీకగా నిలుస్తోంది.
ఇటీవలి కాలంలో వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులు చూడకుండా, వారిని వీధిపాలు చేయటం లేదా ఏ వృద్ధాశ్రమాలలో చేర్పించడం వంటి ఘటనలు పెరిగిపోయాయి. అయితే,ఇందుకు భిన్నంగా ఇక్కడో యువకుడు మాత్రం తల్లిదండ్రుల కోసం ఎవరూ చేయని సాహసానికి పూనుకున్నాడు. తన తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుండాలని ఒడిషాలోని తన్నూర్ నుంచి పూరీలోని జగన్నాథ ఆలయానికి పొర్లుదండాలు పెడుతూ..యాత్ర చేపట్టాడు. నయాగఢ్‌లోని గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన సుశీల్ అనే యువకుడి ఈ ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నయాగఢ్‌లోని జగన్నాథ ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత సుశీల్ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. సాష్టాంగ దండాలు పెడుతూ తన యాత్రను సాగిస్తున్నాడు. సుశీల్ కుమార్ తన తల్లిదండ్రుల గౌరవార్థం వారి చిరకాల కోరిక మేరకు పూరీ జగన్నాథ క్షేత్రానికి ఇలా యాత్ర మొదలుపెట్టారు. గోపాల్‌పుర్ గ్రామానికి చెందిన సుశీల్ ఐటీఐలో డిప్లొమా చేస్తూ.. యూట్యూబరుగా పనిచేస్తున్నాడు. సుశీల్ ఎక్కువగా.. కుటుంబ సంబంధాలు, పిల్లలకు సంబంధించిన అంశాలపై ఎక్కువగా వీడియోలు చేస్తుంటారు. తమకు కొడుకు పుడితే.. తమ గ్రామం నుంచి పూరీకి పాదయాత్ర చేస్తానని గతంలో మొక్కుకున్నాడు. అయితే, పలు కారణాల వలన సుశీల్ తండ్రి ఆ మొక్కు చెల్లించుకోలేకపోయారు. దీంతో, వృద్ధుడైన తండ్రి మొక్కును కుమారుడైన సుశీల్ నెరవేర్చాలని అనుకున్నాడు. సుమారు 120 కి.మీ.ల దూరాన ఉన్న పూరీకి సాష్టాంగ దండాలతో ముందుకు సాగుతున్నారు సుశీల్. నయాగఢ్ జగన్నాథ మందిరం నుంచి మొదలైన సుశీల్ యాత్ర.. నెలన్నర తర్వాత పూరీకి చేరుకోనుంది. ఈ యాత్రలో తల్లిదండ్రులు కూడా సుశీల్ వెంట నడుస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
2025లో గూగుల్‌లో ఎక్కువ ఎవరికోసం సెర్చ్ చేసారో తెలుసా ??
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
మత్స్యకారుల వలలో అరుదైన చేపలు.. అబ్బా అదృష్టం అంటే వీళ్లదే
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

