జపాన్ ట్రీ ఫ్రాగ్ పేగుల్లోని ఇవెంగెల్లా అమెరికానా అనే బ్యాక్టీరియా క్యాన్సర్ కణాలను నాశనం చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో అద్భుత ఫలితాలు చూపించిన ఈ బ్యాక్టీరియా, భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సకు కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. మానవులపై ప్రయోగాలు ఇంకా జరగాల్సి ఉంది.