AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: బోల్డ్ మూవీ అరాచకం.. 100 మంది అమ్మాయిలతో ఆ యవ్వారం.. ఆపై కిడ్నాప్.. ఎక్కడ చూడొచ్చంటే..

ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లో ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. హారర్ , మిస్టరీ థ్రిల్లర్స్ కాకుండా ఈమధ్య కాలంలో రొమాంటిక్ జానర్ సినిమాలకు సైతం మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీలోకి మరో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రాబోతుంది. ఇన్నాళ్లు తమిళనాడులో థియేటర్లలో సంచలనం సృష్టించిన సినిమా.

OTT Movie:  బోల్డ్ మూవీ అరాచకం.. 100 మంది అమ్మాయిలతో ఆ యవ్వారం.. ఆపై కిడ్నాప్.. ఎక్కడ చూడొచ్చంటే..
Fire Movie
Rajitha Chanti
|

Updated on: Mar 18, 2025 | 4:49 PM

Share

తమిళనాడులో థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిన బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఫైర్. బాలాజీ మురగదాస్ హీరోగా నటించిన ఈచిత్రంలో సాక్షి అగర్వాల్, చాందిని తమిళరాసన్, రచితా మహాలక్ష్మి కీలకపాత్రలు పోషించారు. థియేటర్లలో విడుదలైన నెల రోజులకు ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. డైరెక్టర్ జేఎస్కే సతీష్ కుమార్ దర్శకత్వం వహించిన ఈసినిమాకు డీకే మ్యూజిక్ అందించారు. తమిళంలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ఫిబ్రవరి 14న వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సైతం రాబట్టింది. 2020లో నాగర్ కోయిల్ లో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసు ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారట.

ఈ సినిమాలో డైరెక్టర్ సతీష్ కుమార్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ప్రాపర్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఊహించని ట్విస్టులు.. మలుపుల మీద మలుపులు ఉండడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో స్టార్స్ కాకుండా చిన్న చిన్న యాక్టర్స్ ప్రధాన పాత్రలో నటించారు.

కథ విషయానికి వస్తే.. ఫిజియోథెరపిస్ట్ అయిన కాశీ.. ఒక రోజు అదృశ్యం అవుతాడు. కాశీ మిస్సింగ్ పై అతడి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడంతో ఇన్వేస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు శరవణన్. ఈ దర్యాప్తులో కాశీకి సంబంధించి ఊహించని విషయాలు బయటకు వస్తాయి. దాదాపు 100 మందికి పైగా అమ్మాయిలపై కాశీ వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అమ్మాయిల సీక్రెట్ వీడియోలు తీస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేశాడని.. చివరకు ఆ అమ్మాయిలు కాశీకి ఎలాంటి శిక్ష విధించారు అనేది తెలుసుకుంటాడు పోలీస్ ఆఫీసర్ శరవణన్. అనుక్షణం ఊహించని ట్విస్టులతో సాగిన ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..