- Telugu News Photo Gallery Technology photos Want a good smartphone at a low price, These are the phones that are making waves with top features, Top 5 smartphones details in telugu
Top 5 smartphones: తక్కువ ధరకే మంచి స్మార్ట్ ఫోన్ కావాలా..? టాప్ ఫీచర్స్‌తో దుమ్మురేపుతున్న ఫోన్లు ఇవే..!
ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్ అవసరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కాల్స్ చేసుకోవడంతో పాటు అనేక పనులకు తప్పనిసరి అవుతుంది. ఈ నేపథ్యంలో ఫోన్ కొనుగోలు చేసేముందు దాని బ్యాటరీ, ప్రాసెసర్, కెమెరా తదితర వాటిని పరిశీలించుకోవాలి. వీటితో పాటు ధర కూడా చాలా ముఖ్యమే. ప్రస్తుతం అమెజాన్ లో అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.20 వేల లోపు ధరలో లభిస్తున్న మోటరోలా, రియల్ మీ నార్జో 70 టర్బో, టెక్నో పోవా 6 ప్రో, లావా బ్లేజ్ డుయో, ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో స్మార్ట్ ఫోన్ల ప్రత్యేకతలు, ఇతర వివరాలు తెలుసుకుందాం.
Srinu |
Updated on: Mar 18, 2025 | 5:00 PM

మొబైల్ లో గేమ్ లు ఆడుకునే వారికి ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో స్మార్ట్ ఫోన్ చాలా బాగుంటుంది. దీనిలో 6.78 అంగుళాల ఎఫ్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ ప్లే, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఆకట్టుకుంటున్నాయి. డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్‌సెట్ తో పనితీరు చాలా బాగుంటుంది.

లావా బ్లేజ్ డుయో స్మార్ట్ ఫోన్ లో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే అమర్చారు. 64 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ తో స్పష్టమైన ఫొటోలు తీసుకోవచ్చు. మీడియాటెక్ హెలియో జీ99 చిప్ సెట్ ద్వారా పనితీరు చాాలా బాగుంటుంది. ఈ ఫోన్ రూ.16,999 ధరకు అందుబాటులో ఉంది.

మోటరోలా ఎడ్జ్ 50 నియోలోని 6.55 అంగుళాల పిఓలెడ్ డిస్ ప్లేతో విజువల్స్ చాలా స్పష్టంగా ఉంటాయి. స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ ద్వారా మల్టీ టాస్కింగ్ సమర్థవంతంగా చేసుకోవచ్చు. 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 13 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ తో కూడిన డ్యూయల్ కెమెరా సిస్టమ్, 68 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ సమస్య ఉండదు.

అత్యుత్తమ గేమింగ్ ఫోన్లలో రియల్ మీ నార్జో 70 టర్బో ఒకటిగా నిలుస్తుంది. గేమింగ్ ప్రియుల కోసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. దీనిలోని 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.6 అంగుళాల ఎఫ్ హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లే, 64 ఎంపీ ఏఐ ప్రధాన కెమెరా, 33 డబ్లూ ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఆకట్టుకుంటున్నాయి.

బెస్ట్ కెమెరా, బ్యాటరీ కావాలనుకునేవారికి టెక్నో పోవా 6ప్రో స్మార్ట్ ఫోన్ చక్కగా సరిపోతుంది. మినీ ఎల్ఈడీ లైటింగ్, డైమెన్సిటీ 6080 చిప్ సెట్, 108 ఎంపీ ప్రైమరీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 70 డబ్ల్యూ పాస్ట్ చార్జర్ .. బ్యాటరీకి మద్దతు ఇస్తుంది.





























