మా కళ్ల ముందే ఇద్దరిని కాల్చి చంపారు..ఐడీ కార్డులు చెక్ చేసి..వీడియో
పాకిస్థాన్‌లో హైజాక్‌కు గురైన జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను కొన్నేళ్లుగా బలోచ్ రెబల్స్ టార్గెట్ చేసారు. ఈ రైల్లో తరచూ సైనిక దళాలను క్వెట్టా నుంచి పంజాబ్‌కు తరలిస్తుండటం కారణం. 2018 లో ఒకసారి 2023లో మరోసారి దాడులు చేశారు. 2018లో బలోచ్ రెబల్స్ రిమోట్ కంట్రోల్ సాయంతో ట్రైన్‌కు అత్యంత సమీపంలో రెండు బాంబులు పేల్చారు. నాడు ప్రమాదం నుంచి అది బయటపడింది.
2023 జనవరి 19న రైల్లో బాంబుపేలి 13 మంది గాయపడ్డారు. ఇక గతేడాది క్వెట్టా రైల్వేస్టేషన్‌లో పేలుడు జరిగి 26మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా పాక్‌లోని బోలన్ జిల్లాలో హైజాక్‌కు గురైన జాఫర్ ఎక్స్‌ప్రెస్ నుంచి 155 మంది బందీలను భద్రతా దళాలు సురక్షితంగా కాపాడాయి. 27 మంది వేర్పాటువాదులను మట్టుబెట్టాయి. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. రైల్లోని తొమ్మిది బోగీల్లో 400 మంది ప్రయాణికులున్నారు. ఈ రైలు క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. రైల్లో ఉన్న బలోచ్ మిలిటెంట్లు చిన్న బృందాలుగా విడిపోయి ఉండటంతో.. ఆపరేషన్ కష్టతరంగా మారినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. జాఫర్ ఎక్స్‌ప్రెస్ నుంచి ప్రాణాలతో బయటపడిన బందీలు తమ భయానక అనుభవాలను పంచుకున్నారు. ముందుగా భారీ పేలుళ్లు వినిపించాయని.. ఆ తర్వాత కొంతసేపు కాల్పులు జరిగాయని అల్లాదిత్తా అనే ప్రయాణికుడు చెప్పాడు. దీంతో ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకొనేందుకు సీట్ల కింద తల దాచుకొన్నారన్నారు. మిలిటెంట్లు మహిళలు, పురుషులను వేర్వేరుగా ఉంచారు. తాను హృద్రోగినని అని చెప్పడంతో తన కుటుంబాన్ని వదిలేశారని అతడు తెలిపాడు.
మరిన్ని వీడియోల కోసం :
ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల.. వణుకు పుట్టిస్తున్న వీడియో
ఇదికదా టెక్నాలజీ అంటే.. అతని తెలివికి హ్యాట్సాఫ్ వీడియో
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
