AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టులు

ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టులు

Phani CH
|

Updated on: Dec 27, 2025 | 8:14 PM

Share

ఢిల్లీలో విదేశీ పర్యాటకులు తమ ఆటో డ్రైవర్ ముల్చాంద్‌ను రోజంతా నగర పర్యటనకు తీసుకెళ్లిన హృదయపూర్వక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పర్యాటక ప్రదేశాలు చూడని డ్రైవర్‌కు మర్చిపోలేని అనుభవాన్ని ఇచ్చి, నిజమైన భారతీయ ఆతిథ్యాన్ని చాటారు. అతని కుటుంబాన్ని కూడా కలిసి, ఈ స్నేహం నెటిజన్ల ప్రశంసలు అందుకుంది.

ఢిల్లీలో కొందరు విదేశీ పర్యాటకులు తాము ఎక్కిన ఆటో డ్రైవర్‌నే తమతో పాటు రోజంతా టూర్‌కు తీసుకెళ్లారు. మనసును కదిలించే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి మనసులను గెలుచుకుంటోంది. ‘కొన్ని ప్రయాణ జ్ఞాపకాలు గొప్ప కట్టడాల వల్ల రావు, అనుకోకుండా జరిగే చిన్న సంఘటనల వల్లే వస్తాయి’ అని ఆ టూరిస్టుల మీద నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రావెల్ వ్లాగర్ కుర్ కెలియాజా ఉగ్నే షేర్ చేసిన వీడియోలో ఈ వివరాలు ఉన్నాయి. ఆమె, తన స్నేహితులతో ఇండియా గేట్ వద్ద ఉండగా, ముల్చాన్ అనే ఆటో డ్రైవర్‌ వచ్చాడు. తన ఆటో ఎక్కాలని అతను వారిని మర్యాదగా అడిగాడు. అతని తీరు నచ్చటంతో వారంతా అతని ఆటోలో ఎక్కారు. తర్వాత అతడు వారి వివరాలు అడుగుతూ, సరదాగా మాట్లాడటం మొదలుపెట్టటంతో వారు కూడా ఉత్సాహంగా అతడితో ముచ్చటను కొనసాగించారు. వారితో మాట్లాడే క్రమంలో ఆటో డ్రైవర్ ముల్చాన్.. తాను చాలాకాలంగా ఢిల్లీలో ఉంటున్నా.. నగరంలోని అనేక పర్యాటక ప్రదేశాలను తాను చూడలేదని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. ‘విడిగా వెళ్లి చూడటం నీకు కుదరదు కాబట్టి మాతో బాటే వచ్చి చూసేయ్’ అని వారు అతడిని తమతో బాటు లోకల్ ట్రిప్‌కు ఆహ్వానించారు. ఆ ఒక్క పిలుపుతో అది వారి ప్రయాణంలో ఒక మరువలేని రోజైంది. డ్రైవర్, ప్యాసింజర్ అనే తేడా లేకుండా మంచి స్నేహితుల్లా వారంతా కలిసి.. రోజంతా ఢిల్లీలోని అనేక పర్యాటక ప్రదేశాలు, గుళ్లు, పార్కులు తిరిగారు. వారి అనుబంధం అంతటితో ఆగలేదు. స్వదేశానికి తిరిగి వెళ్లే ముందు కుర్ కెలియాజా ఉగ్నే, ఆమె స్నేహితులు ముల్చాన్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులనూ కలిశారు. “ముల్చాన్ మాకు అసలైన భారతీయ ఆతిథ్యాన్ని చూపించారు. ఢిల్లీలోని అనేక ప్రదేశాలు చూడటానికి, తగిన ధరల్లో షాపింగ్ చేయటానికి ఎంతో సాయం చేశాడు. భారత్, దాని చరిత్ర గురించి ఎన్నో కథలు చెప్పారు” అని వారంతా అతడి సేవలను వారింటిలోని వారికి చెప్పి మురిసిపోయారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ఆ డ్రైవర్‌కు జీవితాంతం గుర్తుండిపోయే రోజు ఇదే’, ‘ఇదే కదా అసలైన ప్రేమ, కృతజ్ఞత’ అని కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు

తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు

రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్‌ ఏం చేశాడో చూడండి

అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

జనవరిలో అమలులోకి రానున్న కొత్త రూల్స్‌ ఇవే