జనవరిలో అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఇవే
2026 కొత్త సంవత్సరంలో అనేక కీలక మార్పులు రానున్నాయి. CIBIL స్కోర్ అప్‌డేట్ విధానం, సిమ్ బైండింగ్‌తో సోషల్ మీడియా వినియోగం, 8వ వేతన సంఘం అమలుతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు, DA పెరుగుదల, వంట గ్యాస్ సిలిండర్ ధరల సవరణ వంటి ఆర్థిక, డిజిటల్ మార్పులు దేశవ్యాప్తంగా ప్రజలపై ప్రభావం చూపనున్నాయి. ఈ నూతన విధానాలపై అవగాహన ముఖ్యం.
2025 ముగియడానికి ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జస్ట్ 8 డేస్‌లో న్యూ ఇయిర్ ఎంటర్ కాబోతోంది. నూతన సంవత్సరంలో అడుగుపెట్టేందుకు దేశవ్యాప్తంగా అందరూ సమాయత్తమవుతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నారు. కొంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి టూర్‌కు వెళుతుండగా.. మరికొంతమంది ఇంట్లోనే జరుపుకునేందుకు సన్నాహాలు చేసుకుంటారు. మరికొంతమంది ఫ్రెండ్స్‌తో సెలబ్రేట్ చేసుకునేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు వేసుకుంటారు. ఇదంతా ఓకే.. మరి న్యూ ఇయర్ వస్తుందంటే ఆర్ధికంగా మనల్ని ప్రభావితం చేసే పలు విషయాల్లో మార్పులు కూడా చోటుచేసుకుంటూ ఉంటాయి. బ్యాంకింగ్ నుంచి జీతాల వరకు 2026లో జరగబోయే మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం. 2026 నుంచి మీ క్రెడిట్ రిపోర్ట్ అప్డేట్‌లో మార్పులు జరగనున్నాయి. ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి బ్యాంకింగ్ సంస్థలు అప్డేట్ చేస్తుండగా.. కొత్త ఏడాది నుంచి వారం రోజులకు ఒకసారి ఆ పని చేయాల్సి ఉంటుంది. దీని వల్ల సిబిల్ స్కోర్ విషయంలో మరింత పారదర్శకత ఉంటుందని, సులువుగా రుణాలు పొందేందుకు ఉపయోగపడుతుందని ఆర్బీఐ చెబుతోంది. దీని వల్ల మోసపూరితంగా లోన్లు పొందేవారికి చెక్ పడుతుందని అంటోంది. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో కేంద్రం వాటిని అరికట్టేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇక నుంచి సోషల్ మీడియా యాప్‌లు వాడాలంటే సిమ్ బైండింగ్ తప్పనిసరి చేసింది. సిమ్ బైండింగ్, వెరిఫికేషన్ చేసాకే యాప్స్ వాడేలా మార్పులు చేయాలని వాట్సప్, టెలిగ్రాం, స్నాప్ చాట్ లాంటి యాప్స్‌ను కేంద్రం ఆదేశించింది. దీంతో కొత్త సంవత్సరం నుంచి దీనిని అమలు చేయనున్నారు. న్యూఇయర్ ప్రభుత్వ ఉద్యోగులకు పండగే అని చెప్పాలి. ఎందుకంటే.. జనవరి 1వ తేదీ నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి రానుంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో మార్పులు జరిగే అవకాశముంది. 2026 నుంచి ఉద్యోగులకు డీఏ కూడా పెరగనుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఉద్యోగుల కనీస వేతనాలను పెంచడానికి సిద్దమవుతున్నాయి. కొత్త సంవత్సరంలో పెంపును అమల్లోకి తీసుకురానున్నాయి. ప్రతీ నెల 1వ తేదీన వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఆ తేదీన కొత్త రేట్లను ఆయిల్ కంపెనీలు ప్రకటిస్తూ ఉంటాయి. గత నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను కాస్త తగ్గించారు. ఇక జనవరి 1న కొత్త ధరలను ప్రకటించనున్నారు. కొత్త ఏడాదిలో వంట గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉంటాయనేది చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bad Girl Review: కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్ రివ్యూ
Patang Movie Review: మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
Allu Arjun: రేపటి కోసం అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

