Patang Movie Review: మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
పతంగ్ సినిమా స్నేహం, ప్రేమ, గాలిపటాల పందెం నేపథ్యంలో రూపొందిన యూత్ ఫుల్ డ్రామా. దర్శకుడు ప్రణీత్ ప్రతిపాటి హైదరాబాద్ బస్తీ సంస్కృతిని చక్కగా చూపించారు. కొత్త నటీనటులు ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి పగడాల తమ నటనతో ఆకట్టుకున్నారు. సంగీతం, సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలం. రన్ టైమ్ కాస్త ఎక్కువైనా, యూత్ ని ఆకట్టుకునే కథనంతో ఈ సినిమా అలరిస్తుంది.
సంక్రాంతి పండుగ అంటేనే గాలిపటాలు, పందెం, సందడి. ఈ కల్చర్‌ని, స్నేహాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమే పతంగ్. కొత్త నటీనటులతో, సికింద్రాబాద్ బస్తీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. పంతంగ్ కథ విషయాన్ని వస్తే.. అరుణ్ అలియాస్ ప్రణవ్ కౌశిక్, విస్కీ అలియాస్ వంశీ పూజిత్ చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరి ప్రపంచం చాలా సరదాగా సాగిపోతుంటుంది. అయితే వీరి జీవితాల్లోకి ఐశ్వర్య అలియాస్ ప్రీతి పగడాల ఎంట్రీ ఇస్తుంది. ఐశ్వర్య రాకతో ఈ ముగ్గురి మధ్య సమీకరణాలు ఎలా మారాయి..? స్నేహం, ప్రేమ మధ్య ఏర్పడిన ఘర్షణలో పతంగ్ పోటీ ఎందుకు కీలకంగా మారింది..? చివరికి ఐశ్వర్య మనసును ఎవరు గెలుచుకున్నారు..? వీళ్ళ మధ్యలోకి గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఎందుకు వచ్చాడు అనేది అసలు కథ.. దర్శకుడు ప్రణీత్ ప్రతిపాటి ఒక సింపుల్ పాయింట్‌ని తీసుకుని, దానికి ఎమోషన్ స్పోర్టివ్ స్పిరిట్‌ని జోడించి ఈ సినిమాను చక్కగా తెరకెక్కించాడు. కథలో పెద్దగా ట్విస్టులు లేకపోయినా.. ఫ్రెండ్‌షిప్ మూమెంట్స్, హైదరాబాద్ కల్చర్‌ని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. అరుణ్, విస్కీల మధ్య స్నేహం, వారి అల్లరి, లవ్ ట్రాక్‌తో ఈ సినిమా సరదాగా సాగిపోతుంది. కాకపోతే వాళ్ళ చైల్డ్ హుడ్ సీన్స్ మరీ అంత లెంత్ అవసరం లేదేమో.. అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ లోనే అసలు కథ మొదలవుతుంది. గాలిపటాల పోటీ, అందులో ఉండే ఎమోషన్స్ సినిమాకి ప్రధాన బలం. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్స్ సరదాగా ఉన్నాయి. అయితే కథనం అక్కడక్కడా కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు ఉండటం, సినిమా ఊహించేలా ఉండటం ఈ సినిమాకు కాస్త మైనస్. టాలీవుడ్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఇప్పటి వరకు చాలా వచ్చాయి.. ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించే కథలు మనకు కొత్త కాదు.. కానీ ఒక అమ్మాయి ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో పడడం అనేది మాత్రం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. నాటి ప్రేమదేశం.. నిన్నటి బేబీ, లాంటి కథే.. కాకపోతే అందులో కథ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అదే కథను లైటర్ నోట్ లో తీస్తే అదే పతంగ్. హైదరాబాద్ బేస్ కథ కాబట్టి పతంగ్ రేస్ ఎంచుకున్నాడు దర్శకుడు. ఇక చివరి 40 నిమిషాలు సై నుంచి ఇన్ స్పైర్ అయినట్టు అనిపిస్తుంది. ప్రణవ్ కౌశిక్ లవర్ బాయ్ పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌లో చాలా పరిణితి చూపించాడు. వంశీ పూజిత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇంటెన్సిటీని బాగా పండించాడు. ప్రీతి పగడాల స్క్రీన్ మీద అందంగా కనిపించడమే కాకుండా, తన నటనతో ఆకట్టుకుంది. విష్ణు ఓయ్ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించగా, ఎస్పీబీ చరణ్, అను హాసన్ తమ పాత్రలతో మెప్పించారు. ఇక ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ మ్యూజిక్. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. శక్తి అరవింద్ కెమెరా పనితనం సూపర్. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా ఇంకా క్రిస్ప్‌గా ఉండేది. ఎందుకో.. రన్ టైమ్ 2 గంటల 42 నిమిషాలు కాస్త ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు ప్రణీత్ తెలిసిన కథనే కొత్తగా ట్రై చేశాడు. ఓవరాల్ గా పతంగ్.. లెంత్ ఎక్కువైంది.. కానీ పర్లేదు.. యూత్ ఫుల్ డ్రామా..!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: రేపటి కోసం అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
TOP 9 ET: ప్రభాస్ పక్కకు వెళ్లేలా ఐకాన్ స్టార్ రికార్డ్
Dhandora Review: ‘కులం చుట్టూ తిరిగే.. హార్డ్ హిట్టింగ్ సినిమా ఇది’
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

