బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
కొత్త ఏడాది 2026కి సంబంధించి బాబా వంగా, నోస్ట్రడామస్, భవిష్య మాలిక భవిష్యవాణిని ఈ కథనం వివరిస్తుంది. AI ఆధిపత్యం, తీవ్ర వాతావరణ మార్పులు, గ్రహాంతర జీవులతో సంభోగాలు, నయంకాని వ్యాధుల వ్యాప్తి, మూడవ ప్రపంచ యుద్ధం వంటి విషయాలపై వారి అంచనాలు, హెచ్చరికలను తెలుపబడ్డాయి. ఈ వినాశనాల నుంచి రక్షణకు సూచనలు ఇవ్వబడ్డాయి.
కొత్త ఏడాదికి కోటి ఆశలతో ఆహ్వానం పలకడానికి ప్రతి ఒక్కరూ సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో 2026 ఎలా ఉండబోతోంది? భవిష్యత్తుపై బాబా వంగా, నోస్ట్రడామస్ చెప్పిన అంచనాలేంటి. ప్రపంచవ్యాప్తంగా ఈ వివరాల కోసం సెర్చ్ మొదలుపెట్టారు. బాబా వంగా 2026 అంచనాల ప్రకారం AI మానవ జీవితాన్ని డామినేట్ చేస్తుంది. AI సాంకేతికతపై నే ఆధారపడే పరిస్థితి రావడం ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరించారామె. భూకంపాలు, వర్షాలు, వరదలు, సునామీలు, వేడి గాలులు వీస్తాయని వాతావరణ మార్పులు తీవ్రంగా ఉంటాయని ఆ విధ్వంసం నుంచి తప్పించుకోవాలంటే తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రహాంతర జీవులతో ఒక ఎన్‌కౌంటర్‌ను మానవాళి చూడవచ్చని బాబా వంగా చెప్పారు. కొత్త ఏడాదిలో కరోనా కంటే ప్రమాదకరమైన నయం కాని వ్యాధుల గురించి భవిష్య మాలిక హెచ్చరించింది. ఈ వ్యాధుల వ్యాప్తి ఆరోగ్య వ్యవస్థలను సైతం అల్లకల్లోలం చేస్తుందని చెబుతోంది. సామూహిక భయాందోళన పెద్ద స్థాయిలో ప్రాణనష్టం కలగవచ్చని సైతం హెచ్చరిస్తోంది. ఈ వైపరీత్యాన్ని ఎదుర్కొనేందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలని జాగ్రత్తలు పాటించాలని భవిష్య మాలిక సూచించింది. వాయు, భూమి, సముద్ర ప్రయాణాలకు సంబంధించిన ప్రమాదాలు కూడా పెరుగుతాయనీ నోస్ట్రడామస్ అంచనా వేసారు. మూడవ ప్రపంచ యుద్ధం గురించి చెప్పారు. ఆయన అంచనా ప్రకారం చైనా, మరో పదమూడు ఇస్లామిక్ దేశాలు భారతదేశానికి వ్యతిరేకంగా నిలబడే అవకాశం ఉందట. ఈ సంఘర్షణ అణు ఘర్షణగా కూడా మారవచ్చని.. ఇది ప్రపంచ వినాశనానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. దీర్ఘకాలంగా ఉన్న ప్రపంచ పొత్తులు విచ్ఛిన్నం కావచ్చని.. కొత్త దేశాలు శక్తివంతమైన స్థాయికి ఎదగవచ్చని సూచించారు. ఏఐ ఆటోమేషన్, ఆర్థిక మార్పుల కారణంగా పాశ్చాత్య దేశాల శక్తి క్షీణించవచ్చని సూచించారు. అలాగే ప్రపంచంలో ఉద్రిక్తతలు పెరుగుతాయని రాజకీయ మార్పులు చోటు చేసుకుంటాయనీ తెలిపారు. ఈ కథనంలోని సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. నిపుణులు తెలిపిన అంశాల ఆధారంగా తెలియచేసాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించండి. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టులు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో

