AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

Phani CH
|

Updated on: Dec 27, 2025 | 7:45 PM

Share

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 12 ఏళ్ల రాజేశ్వరి అరుదైన 'ఇక్థియోసిస్ హిస్ట్రిక్స్' అనే జన్యు చర్మ వ్యాధితో బాధపడుతోంది. నాలుగేళ్ల వయసులో ప్రారంభమైన ఈ వ్యాధితో ఆమె చర్మం క్రమంగా రాయిలా గట్టిగా మారుతోంది. శాశ్వత నివారణ లేకున్నా, మాయిశ్చరైజర్‌తో లక్షణాలను అదుపు చేయవచ్చని వైద్యులు తెలిపారు. కుటుంబం ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఈ వ్యాధి ప్రపంచంలోనే అత్యంత అరుదైనది.

ఇటీవల చిన్నారులు కొందరు అరుదైన వ్యాధులతో బాధపడటం నెట్టింట చాలా చూశాం. ఖరీదైన వైద్యం చేయించలేక ఆర్ధిక సహాయం కోసం ఎదురుచూసిన అనేక ఘటనలు సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. పన్నెండేళ్ల బాలిక రాయిలా మారిపోతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాకు చెందిన పన్నెండేళ్ల గిరిజన బాలిక రాజేశ్వరి గత కొన్నేళ్లుగా అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతోంది. ఈ బాలిక శరీరం క్రమంగా రాయిలా మారిపోతోంది. దీంతో ఆ బాలిక నకరం అనుభవిస్తోంది. బిడ్డకు నాలుగేళ్ల వయసున్నప్పుడు వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని తల్లిదండ్రులు తెలిపారు. శరీరంపై ముందుగా పొలుసులు ఏర్పడి.. తర్వాత చెట్టు బెరడులా మారడం..అనంతరం క్రమంగా రాయిలా గట్టిగా మారిపోతోంది. తొలుత చేతులకు వ్యాపించిన ఈ సమస్య తర్వాత శరీరమంతా పాకుతోంది. వ్యాధి కారణంగా బాలిక ఎవరితోనూ కలవలేకపోతోందని, రోజురోజుకూ మానసికంగా కుంగిపోతోందంటూ బాలిక కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స కోసం అనేక ఆసుపత్రులను సంప్రదించినా ఫలితం లేకపోయిందని కన్నీటిపర్యంతమవుతున్నారు. కాగా, రాజేశ్వరి ‘ఇక్థియోసిస్‌ హిస్ట్రిక్స్‌’ అనే జన్యుపరమైన చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది చాలా అరుదైనదని, ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధికి సంబంధించి పదుల సంఖ్యలో మాత్రమే కేసులు నమోదైనట్టు వైద్య నిపుణులు తెలిపారు. ఇది అంటువ్యాధి కాదని.. దీనికి శాశ్వత నివారణ లేనప్పటికీ..ప్రతిరోజు మాయిశ్చరైజర్‌ రాసుకోవడం ద్వారా వ్యాధి ప్రభావాన్ని కొంత మేర తగ్గించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జనవరిలో అమలులోకి రానున్న కొత్త రూల్స్‌ ఇవే

Bad Girl Review: కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ

Patang Movie Review: మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే

Allu Arjun: రేపటి కోసం అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్

నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!