క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
అంతర్వేది మినీ హార్బర్‌లో క్రిస్మస్ రోజున మత్స్యకారులకు అరుదైన శిలువ పీత దొరికింది. దాని డొప్పపై శిలువ ఆకారం ఉండటంతో దాన్ని దైవంగా భావించారు. క్రైస్తవులు పవిత్రంగా చూసే క్రిస్మస్ రోజు దొరకడంతో, అదృష్టంగా భావించి పీతను తిరిగి సముద్రంలో వదిలేశారు. ఈ పీతలను సాధారణంగా తినరు, మత్స్యకారులకు ఇది శుభసూచకం.
సముద్రంలో రకరకాల చేపలు జీవిస్తాయి. ఇటీవల భారీ తిమింగలాలు తీరానికి కొట్టుకొస్తున్న ఘటనలు మనం చూసాం. తాజాగా అంతర్వేది మినీ హార్బర్‌లో విచిత్రమైన పీత ఒకటి మత్స్యకారులకు దొరికింది. క్రిస్మస్ వేళ దొరికిన ఆ పీతను దైవసమానంగా భావించి దానిని తిరిగి సముద్రంలో వదిలేసారు మత్స్యకారులు. పీత దైవ సమానమేంటి అనుకుటున్నారా.. నిజమే.. అది శిలువ పీత. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ హార్బర్లో ఈ అరుదైన సిలువ పీత మత్స్యకారుల వలకు చిక్కింది. సాధారణంగా వేలల్లో పీతలను వేటాడినప్పుడు చాలా అరుదుగా ఈ సిలువ పీతలు ఒకటో రెండో పడతాయి. ఈ పీతకు ఆ పేరు ఎందుకొచ్చిందంటే.. ఆ పీత డొప్పమీద శిలువ ఆకారం ఉంటుంది. అందుకే దానిని శిలువ పీత అంటారు. అందులోనూ క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ రోజున సిలువ పీత దొరకడంతో దానిని దైవంగా భావించి మత్స్యకారులు నదిలో వదిలిపెట్టారు. దైవంగా భావించే ఈ పీతలను తినడానికి ఎవరూ ఆసక్తి చూపరని మత్స్యకారులు అంటున్నారు. క్రిస్మస్ వేళ ఇలా సిలువ పీత దొరకడం తమ అదృష్టం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gmail: గుడ్ న్యూస్.. మీ మెయిల్ ఐడీని మార్చుకోవచ్చు.. ఈ విధంగా
తొలి విడత జనగణనకు సర్వం సిద్ధం.. ముందుగా లెక్కించేది వాటినే
Srisailam: శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
టెక్ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ ఏఐ స్థానంలో మళ్లీ ఉద్యోగులు
భారత్‌లో కొత్త ట్రెండ్..పెళ్లికి "నో" చెబుతున్న యంగ్ ఇండియా.!
జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ.. పోలీసుల సంచలన ప్రకటన!
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్..

