మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో
కొందరు వ్యసనాలకు, ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలు, దోపిడీల బాట పడుతున్నారు. ప్రతిఘటిస్తే.. ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. అసలు ఎదుటి వ్యక్తికి ఏదైనా సాయం చెయ్యాలన్నా వెయ్యి సార్లు ఆలోచించే పరిస్థితులు దాపురించాయి. సాయం చేసిన వ్యక్తుల్నే చీట్ చేయడం, మాయ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. తాజాగా హైదారాబాద్ కూకట్‌పల్లిలో అలాంటి ఘటనే వెలుగుచూసింది.
KPHB సమీపంలో నివాసం ఉండే ఓ మహిళ ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపి చల్లి.. ముగ్గు వేస్తుంది. అప్పుడే ఆమెను చూసాడో లేక ముందుగానే రెక్కీ చేసుకున్నాడో తెలియదు కానీ.. ఓ వ్యక్తి మంకీ క్యాప్ పెట్టుకుని ఆ ఇంటి వద్దకు వచ్చాడు. అమ్మా దాహంగా ఉంది మంచినీళ్లు ఉంటే ఇస్తారా అని బాటిల్ పట్టుకుని అడిగాడు. పాపం ఆ మహిళ దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నట్లు ఉన్నాడు.. దాహమేసినట్లుంది అనుకొని ముగ్గు గిన్నె వాకిట్లో ఉంచి.. మంచినీళ్లు తెచ్చేందుకు ఇంట్లోకి వచ్చింది. ఆమె వెంటే వెళ్లిన ఈ దుండగుడు.. గేటు లోపలికి వచ్చి.. గుమ్మం దగ్గర ఆగి కర్టెన్ తీసి.. లోపలికి వంగి బాటిల్ ఇస్తున్నట్లు నటించాడు. ఇంట్లో ఎవరూ కనిపించకపోయేసరికి.. లోపలికి వెళ్లి ఆమె మెడలో బంగారం గొలుసు లాక్కుని పరారయ్యాడు. ఊహించని ఈ పరిణామానికి ఆ మహిళ కంగుతింది. అతని వెనక ఆమె కూడా పరుగులు తీసింది. ఆ ఆగంతకుడు.. వెళ్తూ గేటు మూసేయ్యడంతో.. ఆమె త్వరగా బయటకు వెళ్లలేకపోయింది. ఆమె గేటు తీసుకొని వెళ్లేసరికి దొంగ కనిపించకుండా పరారయ్యాడు. ఈ దొంగ వ్యవహారం అంతా ఆ ఇంటి వద్ద సీసీ కెమెరాలో రికార్డయింది.
మరిన్ని వీడియోల కోసం :
ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల.. వణుకు పుట్టిస్తున్న వీడియో
ఇదికదా టెక్నాలజీ అంటే.. అతని తెలివికి హ్యాట్సాఫ్ వీడియో
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

