Yemen: ఐరాస జోక్యంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం.. పరేడ్‌ నిర్వహించి సత్తా చాటుకున్న హౌతీ దళాలు..

హౌతీ పేరు వినగానే ఉగ్రవాదులు, తిరుగుబాటుదారులే గుర్తుకొస్తారు.. ఇప్పుడు వారు ఓ దేశ సైన్యానికి ఉండాల్సిన హంగులను సమకూర్చుకొని ఏకంగా భారీ పరేడ్‌ నిర్వహించారు.

Yemen: ఐరాస జోక్యంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం.. పరేడ్‌ నిర్వహించి సత్తా చాటుకున్న హౌతీ దళాలు..
Yemen's Houthi Group
Follow us

|

Updated on: Sep 25, 2022 | 6:18 AM

Yemen’s Houthi group: హౌతీ పేరు వినగానే ఉగ్రవాదులు, తిరుగుబాటుదారులే గుర్తుకొస్తారు.. ఇప్పుడు వారు ఓ దేశ సైన్యానికి ఉండాల్సిన హంగులను సమకూర్చుకొని ఏకంగా భారీ పరేడ్‌ నిర్వహించారు. యెమెన్‌లోని హొడైదాలో జరిగిన ఈ కవాతులో తమ శక్తిని చాటుకున్నారు. 25 వేల మంది సైనికులు, క్షిపణులు, ట్యాంకర్లు, గన్స్‌, డ్రోన్స్‌ ఇతర ఆయుధాలను ప్రదర్శించారు. యెమెన్ ప్రభుత్వాన్ని సైతం వణికించిన ఈ కవాతు ప్రపంచ దేశాల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్శించింది. యెమెన్‌లో 2014 నుంచి ప్రభుత్వ దళాలకు, హౌతీ తిరుగుబాటుదారులకు మధ్య కొనసాగిన అంతర్యుద్ధంలో 10 వేల మంది చనిపోయారు.. 40 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఎందరో దేశ విడిచి శరణార్థులుగా వెళ్లిపోయారు. దీంతో యెమెన్‌ పూర్తిగా శిథిలమైపోయింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని, ఎక్కడ చూసిన ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.

ఈ అంతర్యుద్దంలో యెమెన్‌ ప్రభుత్వానికి సౌదీ అండగా నిలువగా, ఇరాన్‌ మద్దతుతో హౌతీలు రెచ్చిపోయారు. హౌతీల ముట్టడితో యెమెన్‌ ప్రభుత్వం రాజధాని సనాను విడిచిపోవాల్సి వచ్చింది. గత ఏప్రిల్‌లో ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో ప్రభుత్వానికి, హౌతీలకు మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ పరస్పర దాడులు కొనసాగుతూ వచ్చాయి. తర్వాత ఐక్యరాజ్యసమితి జోక్యంతో హౌతీ తిరుబాటుదారులు శాంతించారు.

తమ దేశంలో సంవత్సరాలుగా సాగుతున్న అంతర్యుద్దానికి ముగింపు పలికి, శాంతికి నెలకొల్పేందుకు అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో కోరారు యెమెన్‌ అధ్యక్షుడు అల్-అలిమి. తమకు సహకారం అందించాలంటూ అమెరికా సహా అన్ని దేశాలను కోరారు.

ఇవి కూడా చదవండి

అంతకుముందు సెప్టెంబర్ 20 న సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వాల మంత్రులు, ప్రతినిధులు యెమెన్‌లో పరిస్థితిని చర్చించడానికి సమావేశమయ్యారు. అనంతరం హౌతీ తిరుగుదళాలు, ప్రభుత్వం చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..