Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఒట్టి చేతులతో స్కూల్‌ టాయిలెట్‌ను క్లీన్‌ చేసిన బీజేపీ ఎంపీ.. నెట్టింట వీడియో వైరల్‌

ఆయనొక మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ ఎంపీ.. ఒట్టి చేతులతో స్కూల్‌ టాయిలెట్‌ను శుభ్రం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

Watch Video: ఒట్టి చేతులతో స్కూల్‌ టాయిలెట్‌ను క్లీన్‌ చేసిన బీజేపీ ఎంపీ.. నెట్టింట వీడియో వైరల్‌
Bjp Mp Janardan Mishra
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 24, 2022 | 5:32 AM

BJP MP Janardan Mishra: ఆయనొక మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ ఎంపీ.. ఒట్టి చేతులతో స్కూల్‌ టాయిలెట్‌ను శుభ్రం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా.. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా చక్‌దేవ్‌పూర్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 5, 6 తరగతులు చదువుతున్న బాలికలతో మరుగుదొడ్లను శుభ్రం చేయించారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కాంగ్రెస్ సహా పలు పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు అధికార పార్టీ బీజేపీకి చెందిన ఎంపీ రంగంలోకి దిగారు. ఓ పాఠశాలకు వెళ్లి ఒట్టి చేతులతో మరుగుదొడ్డి క్లీన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

బాలికలు మరుగుదొడ్లను క్లీన్‌ చేస్తున్న ఫొటోలు వైరల్‌ అయిన అనంతరం రేవా బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పార్టీ నిర్వహిస్తున్న ‘సేవా పఖ్‌వాడ’ కార్యక్రమంలో భాగంగా ఖత్‌ఖారీ (Khatkhari) లోని ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆయన సందర్శించి అక్కడ ముందుగా మొక్కలు నాటారు. అనంతరం అపరిశుభ్రంగా ఉన్న స్కూల్‌ మరుగుదొడ్డిని చూసి.. ఒట్టి చేతులతో క్లీన్‌ చేశారు. అంతేగాక ఈ వీడియోను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రధాని మోదీ, జేపీ నడ్డా, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ సహా పలు పార్టీ నేతలకు కూడా దీనిని ట్యాగ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

కాగా.. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఒట్టి చేతులతో స్కూల్‌ టాయిలెట్‌ను క్లీన్‌ చేసిన బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా ఓవరాక్షన్‌ చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇదొక రాజకీయ స్టంట్‌ అని, స్కూల్‌ పిల్లలతో టాయిలెట్‌ క్లీనింగ్‌ను కప్పిపుచ్చేందుకు ఆయన ఇలా చేశారంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌ గుణ జిల్లా చక్‌దేపూర్ (Chakdeopur village) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం బాలికలు మరుగుదొడ్లను క్లీన్‌ చేస్తూ కనిపించారు. స్కూల్ యూనిఫాంలో ఉన్న కొంతమంది బాలికలు ఇక్కడ టాయిలెట్లను శుభ్రం చేస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. పాఠశాల ముగిసిన తర్వాత బాలికలు స్కూల్ టాయిలెట్లను బలవంతంగా శుభ్రం చేయిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదాస్పద ఘటన సెప్టెంబర్ 20న జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి