AIIMS Delhi Director: ఎయిమ్స్ ఢిల్లీ నూతన డైరెక్టర్‌గా డాక్టర్ డా. ఎం. శ్రీనివాస్..
దేశంలోని ప్రఖ్యాత వైద్యవిద్యా సంస్థ ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) డైరక్టర్‌గా డా. ఎం. శ్రీనివాస్ నియమితులయ్యారు.
Director of AIIMS-Delhi Dr M Srinivas: దేశంలోని ప్రఖ్యాత వైద్యవిద్యా సంస్థ ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) డైరక్టర్‌గా డా. ఎం. శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ డీన్‌గా డాక్టర్ శ్రీనివాస్ పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఎయిమ్స్ డైరక్టర్‌గా పనిచేసిన డా. రణ్‌దీప్ గులేరియా పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. డా. శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టేవరకు గులేరియా పదవిలో ఉండనున్నారు. డా. శ్రీనివాస్ వయస్సు 65 ఏళ్లు పూర్తయ్యేవరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఎయిమ్స్ డైరక్టర్‌గా కొనసాగుతారని కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఐసీఎంఆర్ చీఫ్ గా..
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంస్థకు కొత్త అధిపతిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం స్విట్జర్లాండ్ జెనీవాలోని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెటర్నల్ న్యూబోర్న్ చైల్డ్ అండ్ అడాలసెంట్ హెల్త్ అండ్ ఏజింగ్ విభాగానికి యూనిట్ హెడ్‌గా ఆయన పనిచేస్తున్నారు. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్‌గా ఇంతకాలం పనిచేసిన డా. బలరాం భార్గవ పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో డా. రాజీవ్ బహల్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ బాధ్యతలతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ విభాగానికి కార్యదర్శిగానూ ఆయన బాధ్యతల్ని నిర్వర్తించాల్సి ఉంటుందని కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొన్నాయి. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.