TSRTC: క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఆ మ్యాచ్ కు స్పెషల్ బస్సులు ఏర్పాటు

ప్రయాణీకుల సౌకర్యం కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వారి అవసరాలు, రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు స్పెషల్ బస్సులను రన్ చేస్తోంది. ఇప్పటికే పలు రాయితీలు, ఆఫర్ లు ప్రకటించి.. ప్రయాణీకుల..

TSRTC: క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఆ మ్యాచ్ కు స్పెషల్ బస్సులు ఏర్పాటు
Tsrtc
Follow us

|

Updated on: Sep 24, 2022 | 7:15 AM

ప్రయాణీకుల సౌకర్యం కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వారి అవసరాలు, రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు స్పెషల్ బస్సులను రన్ చేస్తోంది. ఇప్పటికే పలు రాయితీలు, ఆఫర్ లు ప్రకటించి.. ప్రయాణీకుల నుంచి మంచి స్పందన తీసుకువస్తున్న ఆర్టీసీ మరోసారి అదే విధమైన చర్యలూ తీసుకుంది. ప్రస్తుతం ఇండియా ఆస్ట్రేలియా మధ్య టీ-20 సిరీస్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇండియా, ఆస్ట్రేలియా చెరో మ్యాచ్ గెలవగా.. నిర్ణయాత్మక మూడో మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ క్రికెట్‌ స్టేడియంలో ఈ నెల 25న జరగనుంది. మ్యాచ్ పై ఇప్పటికే తీవ్ర రగడ నెలకొనగా.. హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ స్పందనతో టిక్కెట్ల వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఈ క్రమంలో మ్యాచ్ కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మ్యూచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి వచ్చే ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా సిటీ బస్సులను నడిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ సికింద్రాబాద్‌ రీజియన్‌ మేనేజర్‌ సీహెచ్‌ వెంకన్న వివరాలు వెల్లడించారు. మేడ్చల్‌, హకీంపేట్‌, సికింద్రాబాద్‌, జేబీఎస్‌, జీడిమెట్ల, ఘట్‌కేసర్‌, కోఠి, మోహిదీపట్నం, పటాన్‌చెరు వంటి వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్‌ స్టేడియం వరకు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. ప్రేక్షకులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, ఈ సౌకర్యాన్ని క్రికెట్‌ అభిమానులు ఉపయోగించుకోవాలని కోరారు.

కాగా.. భారత్- ఆస్టేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయంపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద గురువారం తొక్కిసలాట జరిగింది. 20 మంది క్రికెట్ అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. కానిస్టేబుల్, ఫైర్ సిబ్బంది, నలుగురు మహిళలు, ఒకరు సివిలియన్ కు గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. దాదాపు మూడు సంవ‌త్సరాల త‌రువాత హైద‌రాబాద్ ఉప్పల్ స్టేడియం భార‌త్ ఆస్ట్రేలియా మ‌ధ్య మూడో టీ 20 కి అతిధ్యం ఇవ్వనుంది. సెప్టెంబ‌ర్ 25న జ‌రిగే ఈ మ్యాచ్ టికెట్ల కోసం ప్రేక్షకులు విపరీతంగా వచ్చారు. మొద‌ట పేటీఎం వేదిక‌గా టికెట్లు అమ్మిన‌ట్లు హెచ్‌సీఏ పేర్కొంది. అయితే.. 39 వేల టికెట్లు ఏమ‌య్యాయంటూ అభిమానులు చేపట్టిన నిరసన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.

ఈ ఘటనపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు అజరుద్దీన్ స్పందించారు. జింఖాన్ గ్రౌండ్ వద్ద జరిగిన ఘటన బాధాకరమన్న ఆయన.. ఘటనలో గాయపడిన వారి వైద్య ఖర్చులను తామే భరిస్తామని వెల్లడించారు. ఆన్ లైన్ లో 11,450 టికెట్లు విక్రయించామన్నారు. మ్యాచ్ టికెట్లను బ్లాక్ చేశామని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని వెల్లడించారు. తొక్కిసలాటకు HCA కారణం కాదని, అక్కడ భద్రతను చూసుకోవల్సింది పోలీసులే అని అజారుద్దీన్ తెలిపారు. టికెట్లు బ్లాక్ లో అమ్మితే పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. మ్యాచ్ టికెట్ల విక్రయం విషయంలో HCA నుంచి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని అజారుద్దీన్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.